అన్వేషించండి

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

Congress Candidates for Rajya Sabha Elections 2026 | రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీతో పాటు వేం నరేందర్ రెడ్డిలకు అవకాశం ఇచ్చింది.

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ఎంపిక ప్రతిపాదనలను ఆమోదించారు. పలు రాష్ట్రాల నుండి పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 5 రాష్ట్రాల నుంచి ఆరుగురు అభ్యర్థులకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వగా.. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల పేర్లు ప్రకటించారు. 

రాష్ట్రాల వారీగా అభ్యర్థులు
కాంగ్రెస్ తాజా ప్రకటన ప్రకారం 5 రాష్ట్రాల నుండి మొత్తం ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తే..

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం నుండి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు.

ఛత్తీస్‌గఢ్: ఇక్కడి నుండి ఫూలో దేవి నేతమ్ పోటీ చేయనున్నారు.

హర్యానా: హర్యానా నుంచి కరమ్వీర్ సింగ్ బౌధ్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

హిమాచల్ ప్రదేశ్: కాంగ్రా డీసీసీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ ఇక్కడి నుండి బరిలో ఉన్నారు.

తమిళనాడు: తమిళనాడు నుండి ఎమ్. క్రిస్టోఫర్ తిలక్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు.

పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది.

సింఘ్వీకి మరో ఛాన్స్: జాతీయ స్థాయిలో పార్టీకి ట్రబుల్ షూటర్‌గా, బలమైన గొంతుకగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ సేవలను గుర్తించి పార్టీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. గతంలో ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన ఆయన పదవీకాలం ముగియనుండటంతో, రాష్ట్ర నాయకత్వం కూడా సింఘ్వీ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం సింఘ్వీ పేరును గురువారం ప్రకటించింది.

వేం నరేందర్ రెడ్డికి లక్కీ ఛాన్స్: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా, కష్టకాలంలో తోడున్న వ్యక్తిగా వేం నరేందర్ రెడ్డికి ఈ అవకాశం దక్కింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వీహెచ్, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి లాంటి కొందరు నేతలు రేసులో ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా, ఆయన ఆసక్తి చూపకపోవడంతో వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. 

పార్టీ జాతీయ అవసరాలు, తెలంగాణ స్థానిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం 5 రాష్ట్రాల నుంచి ఆరుగురు అభ్యర్థుల జాబితా మార్చి 5న ఉదయం ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ దృష్ట్యా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. దీంతో పెద్దల సభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రాతినిధ్యం మరింత బలపడనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం.. ఆరోజు ఏం జరిగింది?
KCR re entry: జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం.. ఆరోజు ఏం జరిగింది?
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
Cervical Pain : సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
Embed widget