Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Bookie OTT Platform : రీసెంట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'బూకీ' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిషాన్ హీరోగా నటించారు.

Ajay Dhishan's Bookie Movie OTT Release Date Locked : కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిషాన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'బూకీ'. తమిళంలో 'పూకీ'గా మంచి టాక్ సొంతం చేసుకున్న మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'బూకీ' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... స్ట్రీమింగ్ డేట్ లాక్ అయ్యింది. సరిగ్గా నెల రోజులకు అంటే ఈ నెల 13న ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తమిళ వెర్షన్ రిలీజ్ కన్ఫర్మ్ కాగా తెలుగులో కూడా ఆ రోజే రిలీజ్ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. శాటిలైట్ రైట్స్ 'జీ తెలుగు' సొంతం చేసుకోగా... ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత టీవీల్లోకి ప్రీమియర్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ మూవీకి గణేష్ చంద్ర దర్శకత్వం వహించగా... అజయ్ దీషన్ సరసన ధనుషా హీరోయిన్‌గా నటించారు. సునీల్, మంచు లక్ష్మి కీలకపాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని సహ నిర్మాతగా, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్‌గానూ వ్యవహరించడంతో పాటు కీలకపాత్రలో నటించారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆయన భార్య ఫాతిమా విజయ్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో సర్వంత రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో రిలీజ్ చేశారు.
Also Read : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
స్టోరీ ఏంటంటే?
కైలాష్ (అజయ్ దిషాన్), ఆషా (ఆర్కే ధనుషా) లవర్స్. ఓ గొడవ తర్వాత ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి నడి రోడ్డు మీదే ఒకరిని ఒకరు చెంప దెబ్బలు కొట్టుకుంటారు. ఈ వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది. బ్రేకప్ నుంచి బయట పడడం కోసం జిమ్‌లో జాయిన్ అవుతాడు కైలాష్. అక్కడ ఓ అమ్మాయి పరిచయం అవుతుంది.
ఆమె వల్ల వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ తర్వాత ఆధ్యాత్మిక ఆశ్రమానికి వెళ్లిన ఆషాను బాబా (సునీల్) ఏం చేశారు? ఆ తర్వాత సైకాలజిస్ట్ (లక్ష్మీ మంచు) దగ్గరకు ఎందుకు వెళ్లింది? తన వరుసకు మరదలయ్యే కావ్య (శియారా) వల్ల కైలాష్ ఏం తెలుసుకున్నాడు? బ్రేకప్ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఏం జరిగింది? వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ట్రెండింగ్ వార్తలు























