అన్వేషించండి

Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!

Bengal governor: బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే చాలా రోజులు పదవిలో ఉన్నానని ఆయన చెబుతున్నారు.

CV Ananda Bose resigns from Bengal governor position:   పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను సమర్పించారు. 2022 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన, సుమారు మూడున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగారు. రాజీనామా అనంతరం ఆయన స్పందిస్తూ, గవర్నర్ కార్యాలయంలో నేను తగినంత సమయం గడిపాను అని క్లుప్తంగా వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల  తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మమతతో నిరంతర యుద్ధం 

ఆనంద బోస్ పదవీకాలం మొదటి నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో విభేదాలతోనే సాగింది. ముఖ్యంగా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు,  పంచాయతీ ఎన్నికల హింస వంటి అంశాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన నేరుగా తలపడ్డారు. ప్రభుత్వం పంపిన పలు బిల్లులను పక్కన పెట్టడం ద్వారా ఆయన రాజ్‌భవన్‌ను ఒక  సమాంతర ప్రభుత్వం లా నడుపుతున్నారని టీఎంసీ నేతలు తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలో మమతా బెనర్జీపై ఆయన పరువు నష్టం దావా కూడా వేయడం రాజకీయంగా పెను దుమారం రేపింది.

చుట్టుముట్టిన లైంగిక వేధింపుల ఆరోపణలు 

ఆనంద బోస్ పదవిలో ఉండగానే అత్యంత వివాదాస్పదమైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2024 మే నెలలో రాజ్‌భవన్‌కు చెందిన ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిని, గవర్నర్ తనను వేధించారని కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ,  రాజ్‌భవన్‌లో మహిళలకు భద్రత లేదు అని ఘాటుగా విమర్శించారు. దీనికి ప్రతిగా గవర్నర్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి రాజ్‌భవన్ సీసీటీవీ ఫుటేజీని బహిరంగంగా ప్రదర్శించి ఆరోపణలను ఖండించినప్పటికీ, ఆ మచ్చ ఆయన పదవీకాలాన్ని వెంటాడింది.              

 ఎన్నికల వేళ కీలక పరిణామం 

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఆనంద బోస్ నిష్క్రమణ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూనే రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, మరోవైపు కేంద్రం పంపే కొత్త గవర్నర్ ఎవరనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచుతూ వచ్చిన ఆనంద బోస్, పదవికి దూరమవ్వడం టీఎంసీకి కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ, ఎన్నికల వ్యూహాల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.            

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget