Ugadi Rasi Phalalu 2025: ఉగాది పంచాంగం ఏప్రిల్ 2025 to 2026 మార్చి - కుంభ రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయి!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశివారి నెలవారీ ఫలితాలు
కుంభ రాశి ( ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర మొదటి 3 పాదాలు)
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 7 అవమానం :5
ఏప్రిల్ 2025
ఈ నెలలో మీకు అన్నివిధాలుగా యోగకాలమే. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికలావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్య సిద్ధి ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లానే చేసుకుంటారు.
మే 2025
ఈ నెల కూడా మీకు యోగదాయకమే. ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి. ఆదాయానికి లోటుండదు. గతంలో ఉండే సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు సన్నాహాలు చేస్తారు. స్నేహితుల సహాయంతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
జూన్ 2025
ఈ నెలలో కుంభ రాశివారికి అనుకూల ఫలితాలుంటాయి. ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలు మొదలెడతారు. బంధువుల నుంచి సహకారం ఉంటుంది. వాహనమార్పులు, గృహమార్పులు, నూతన వస్తువులు కొనుగోలు సాధ్యమవుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు
ఉగాది పంచాంగం 2025 తులా రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
జూలై 2025
ఈ రాశివారికి ఈ నెలలో వృతివ్యాపారముల్లో లాభాలొస్తాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. అయితే కుజుడి సంచారం వల్ల మీకు చికాకులు తప్పవు. అత్యధిక కోపంగా ఉంటారు. సోదరులతో వివాద సూచనలుంటాయి
ఆగష్టు 2025
ఈ నెలలోకూడా ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. కానీ అష్టమంలో కుజుడి కారణంగా అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. శారీరక శ్రమ తప్పదు. ఉద్రేకంగా వ్యవహరిస్తుంటారు. అనుకున్న పనులు పూర్తికావు
సెప్టెంబర్ 2025
కుంభ రాశివారికి సెప్టెంబరు నెలలో గ్రహసంచారం ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో ఆటంకాలు తప్పవు. బంధుమిత్రులతో విరోధాలుంటాయి. ఏం మాట్లాడినా తప్పే అవుతుంది. అనవసర ఖర్చులు, ఔషధాలు వినియోగించడం ఉంటుంది. భార్య భర్త మధ్య సరైన అవగాహన ఉండదు
ఉగాది పంచాంగం 2025 కన్యా రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 2025
ఈ నెలలో కుంభ రాశివారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్నింటిలో విజయం , కొన్నింటిలో అపజయం ఉంటుంది. ఆర్ధికపరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఊహించని చెడు సంఘటనలు జరుగుతాయి. ఇతరులకు హామీలుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.
నవంబర్ 2025
ఈ నెలలో ఆరంభంలో సమస్యలు చుట్టుముడతాయి. ఏ పనిపై శ్రద్ధ ఉండదు. ఏ పని చేసినా అటంకాలు తప్పవు. అందరితో విరోధాలు తప్పవు. గాయాలపాలవుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. గృహంలో మార్పులుంటాయి. ఈ నెల ద్వితీయార్థం అనుకూల ఫలితాలుంటాయి
డిశంబర్ 2025
ఈనెలలో ప్రతివిషయంలో రెండుసార్లు ఆలోచించి నిర్ణయంతీసుకోవాలి. నెల మధ్యలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనుల నుంచి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఉగాది పంచాంగం 2025 వృశ్చిక వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
జనవరి 2026
ఈ నెలలో ప్రథమార్ధం బాగుంటుంది. ఆదాయం కలిసొస్తుంది. ప్రయాణాల్లో లాభాలుంటాయి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. బంధు మిత్రులతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. అయితే ఈనెల ద్వితీయార్థంలో 12 వస్థానంలో గ్రహసంచారం ఇబ్బంది పెడుతుంది.
ఫిబ్రవరి 2026
ఫిబ్రవరి నెల్లోనూ మొదటి రెండు వారాలు అనుకూల ఫలితాలుంటే తర్వాత రెండు వారాలు చికాకులు వెంటాడుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు, తలకు సంబంధించిన ఇబ్బందులు, ప్రయాణంలో కష్టాలు, భార్య భర్త మధ్య కలహాలు ఉంటాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి
మార్చి 2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆఖరి నెలలో కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపార లావాదేవీల్లో అనుకూలత ఉంటుంది కానీ శత్రుమూలకంగా భయాందోళన వెంటాడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. కుటుంబంలో తగాదాలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షలు సంతృప్తికరంగా రాయలేరు
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి
ఉగాది పంచాంగం 2025 ధనస్సు రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

