Ugadi Panchangam 2025: ఏప్రిల్ 2025 to 2026 మార్చి వరకూ ధనస్సు రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయి - ఉగాది పంచాంగం!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయి...
ధనస్సు రాశి ( మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ మొదటి పాదం )
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 1 అవమానం : 5
ఏప్రిల్ 2025
ఈ నెలలో అన్నీ శుభఫలితాలే. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. బంధుమిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది
మే 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మే నెల కూడా మీకు అద్భుతమైన ఫలితాలున్నాయి. సమస్యలు మబ్బులు వీడినట్టు వీడిపోతాయి. సాంఘికంగావృద్ధిలో ఉంటారు. వాహనసౌఖ్యం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో లాభపడతారు.
జూన్ 2025
ఈ నెల ఆరంభం బావుంటుంది కానీ ద్వితీయార్థం నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాలకే అధైర్యపడతారు. వృత్తి వ్యాపారాల్లో కలసిరావు. అనుకున్న పనులు పూర్తికావు. వాహన ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి.
తులా రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
జూలై 2025
అష్టమంలో గ్రహ సంచారం కారణంగా ఈ నెలలో సమస్యలు తప్పవు. అధైర్యంగా ఉంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది కానీ ఫలితం దక్కదు. వాహన ప్రమాద సూచనలున్నాయి. దూర ప్రయాణాలు చేయొద్దు.
ఆగష్టు 2025
ఈ నెలలోనూ అంతే.. మాటపట్టింపులు, వివాదాలు, అనారోగ్య సమస్యలు, అనవసర కోసంతో ఉంటారు. సంతానం వల్ల కూడా ఇబ్బందులు తప్పవు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. స్నేహితుల కారణంగా నష్టపోతారు. చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి.
సెప్టెంబర్ 2026
ఈనెల ప్రధమార్థం బావున్నా ద్వితీయార్థం అంతగా అనుకూలించదు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అనిపిస్తుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వాహనం కనుగోలు చేసే సూచనలున్నాయి. భార్య భర్త మధ్య మాటపట్టింపులు ఉంటాయి.
అక్టోబర్ 2025
గడిచిన మూడు నెలలతో పోలిస్తే అక్టోబర్ లో గ్రహాలు అనుకూల సంచారం ఉంటుంది. అన్నిరంగాలవారికి మంచి ఫలితాలుంటాయి. ఆర్ధికలావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకుబదిలీలు, గృహమార్పులు తప్పవు. నూతన పరిచయాలు ఉపయోగపడతాయి.
(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
నవంబర్ 2025
ఈ నెల ఆరంభం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు, అవమానాలు తప్పవు. మీ పేరు ప్రఖ్యాతులపై దెబ్బపడే ప్రమాదం ఉంది. భూ సంబంధిత వ్యవహారంలో నష్టం తప్పదు.
డిశంబర్ 2025
ఈ నెలలో ధనస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. నెల గడిచేకొద్దీ మంచి ఫలితాలుంటాయి. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది కానీ కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్రేకంగా మాట్లాడుతారు. అనుకోని వివాదాలు పెట్టుకుంటారు. వాహనాలు రిపేర్లు చేయిస్తారు.
జనవరి 2026
ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఎంత ఆదాయం వచ్చినా మంచి నీళ్లలా ఖర్చవుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గొప్పవారితో పరిచయాలు కలిసొస్తాయి.
ఫిబ్రవరి 2026
ఈ నెల అన్ని రంగాల్లో ఉండేవారికి యోగకాలమే. ఆర్థికంగా పర్వాలేదు. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రయాణాలు కలిసొస్తాయి.
మార్చి 2026
చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటాయి కానీ అనుకోని ఖర్చులు తప్పవు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ప్రయాణాల్లో కష్టాలు, చేపట్టిన కార్యాల్లో నష్టాలు ఉంటాయి. నెలలో రెండో భాగం కొంత అనుకూలం.
(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

