Ugadi Rasi Phalalu 2025: తులా రాశి ఉగాది పంచాంగం 2025 -26 - గ్రహబలం, దైవబలంతో ఈ ఏడాది మీకు పట్టిందల్లా బంగారమే!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి వారి వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

Tula Rasi Ugadi Rasi Phalalu 2025-26: తులా రాశివారికి ఈ ఏడాది గ్రహాలన్నీ అనుకూల సంచారమే కావడంతో పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది. గ్రహబలంతో పాటూ దైవబలం కూడా కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సకల శుభాలు కలిగించే గురు గ్రహం శుభస్థానంలో ఉంది. శని కూడా ఆరో స్థానంలో సంచారం వల్ల విశేష యోగఫలం ఉంటుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళా రంగం, రాజకీయాలు, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా మీరున్న ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు పొందుతారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైన మొదటి రెండు మూడు నెలలు కొంత ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆ తర్వాత అన్నీ మంచి రోజులే. కుంభంలో ఉన్న శని మీన రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తులా రాశివారికి పూర్తిస్థాయి ఆనందం సొంతమవుతుంది. ఆదాయం పెరుగుతుంది, శత్రువులు మిత్రులుగా మారుతారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికందుతుంది. గౌరవం పెరుగుతుంది. నూతన గృహం, వాహన యోగం ఉంది.
ఉద్యోగులకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి ఉద్యోగులకు అద్భుతంగా ఉంది. గత కొంతకాలంగా పడుతున్న బాధలన్నీ ముబ్బులు తొలగినట్టు మాయమైపోతాయి. శని యోగకారకుడు అవడంతో మంచి జరుగుతుంది. ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. అనుకోని ధనం చేతికందుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
రాజకీయనాయకులకు
రాజకీయాల్లో ఉండేవారి ఈ ఏడాది మంచి ఉపశమనం లభిస్తుంది. అధిష్టానం నుంచి మీకు గుర్తింపు లభిస్తుంది. మీ కష్టాన్ని గుర్తించి మీకు నామినేటెడ్ పదవి అయినా కట్టబెడతారు. అయితే రాహువు ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు.
కళాకారులకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కళాకారులకు గురుబలం ఉండడంతో బాగా రాణిస్తారు.మంచి అవకాశాలు పొందుతారు, అవార్డులు పొందే అవకాశం ఉంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా విజయం అందుకుంటారు.
వ్యాపారులకు
కొత్త ఏడాదిలో వ్యాపారులకు అనుకూల సమయం. ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు వసూలవుతాయి. హోల్సేల్, రీటైల్, నిర్మాణ రంగం, సిమెంట్, ఫైనాన్స్ వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. కొత్త కాంట్రాక్టులు అందుకుంటారు.
(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
విద్యార్థులకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బావుంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నద విద్యకోసం అడుగులు ముందుకుపడతాయి. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు, కోరుకున్న కళాశాలల్లో సీట్లు పొందుతారు.
క్రీడాకారులకు ఈ ఏడాది కలిసొచ్చే సమయం
వ్యవసాయదారులకు
ఈ ఏడాది తులా రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాన్నిస్తాయి. ప్రభుత్వం నుంచి అవసరం అయిన సహాయం అందుతుంది. కౌలుదార్లకు లాభాలొస్తాయి.
(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
తులా రాశి స్త్రీలకు
తులా రాశి స్త్రీలకు ఈ ఏడాది తిరుగులేదు. కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన ఆభరణాలు , స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ఉండేవారికి అధికారుల మన్ననలు పొందుతారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులేమైనా ఉంటే ఈ ఏడాది తప్పనిసరిగా తొలగిపోతుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. అయితే రాహువు ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులున్నా గురుబలం కలిసొస్తుంది.
ఓవరాల్ గా 2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తులా రాశి వారికి శ్రీ విశ్వావసు నామసంవత్సరంలో గురుబలం వల్ల జీవితం అద్భుతంగా సాగిపోతుంది. రాహువు కారణంగా కొన్ని సమస్యలు తప్పవు..
(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

