Ugadi Panchangam 2025: ఏప్రిల్ 2025 to 2026 మార్చి వరకూ తులా రాశి వారికి ఏ నెలల్లో శుభ ఫలితాలున్నాయి - ఉగాది పంచాంగం
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయి...
తులా రాశి ( చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ మొదటి 3 పాదాలు )
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం:2 అవమానం : 2
ఏప్రిల్ 2025
ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంత లాభదాయకంగా ఉండవు. ఆదాయం కనిపిస్తున్నా ఖర్చులు కూడా అలానే ఉంటాయి. డబ్బు మంచి నీళ్లలా ఖర్చువుతుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఎలాంటి అధైర్యం లేకుండా దూసుకెళ్తారు. ఊహించిన సంఘటనలు జరిగినా అధైర్య పడరు.
మే 2025
ఈ నెలలో గ్రహసంచారం అంత అనుకూలంగా ఉండదు. చేపట్టే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకోని వివాదాలు, కుటుంబంలో కలహాలు ఉంటాయి. సంతానం కారణంగా ఇబ్బంది పడతారు. వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త.
జూన్ 2025
ఈ నెల నుంచి మీకు మంచి రోజులు మొదలవుతాయి. గతంలో ఉన్న ఇబ్బందులున్నీ తొలగిపోతాయి. వ్యాపారం, ఉద్యోగంలో మంచి వార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు తీరుపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో పనులన్నీ పూర్తిచేస్తారు. శుభకార్యాలు కలిసొస్తాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
జూలై 2025
ఈ నెలలో తులా రాశివారికి అన్నివిధాలుగా అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. పుణ్యనదీ స్నానాలు చేస్తారు. స్నేహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరమూలకంగా లాభపజడతారు.
ఆగష్టు 2025
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆధిక్యత మీదే అవుతుంది. అప్పులు తీరిపోతాయి. శత్రువులే మిత్రులవుతారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవాకాశం ఉంది
సెప్టెంబర్ 2025
ఈనెలలో తులా రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఊహించని సమస్యలు ఎదురవుతాయి ప్రతిచిన్న విషయానికి చికాకు పడతారు. అనారోగ్య సమస్యలున్నాయి. కుటుంబంలో కలహాలు బాధపెడతాయి. మానసికంగా కృంగిపోతారు. ప్రయాణాల్లో ప్రమాదాలుంటాయి
(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
అక్టోబర్ 2025
ఈ నెలలో మీకు అంత అనుకూల ఫలితాలు ఉండవు. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. కుటుంబంలో చికాకులుంటాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు పూర్తికావు.
నవంబర్ 2025
ఈ నెలలో డబ్బు మీకు మంచినీళ్లలా ఖర్చువుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతీవ్యవహారంలోనూ అడ్డంకులే ఉంటాయి. అవమానాలు, అపనిందలు పడాల్సి వస్తుంది. నమ్మినవారే మోసం చేస్తారు. సకాలంలో డబ్బు చేతికందదు. వాహన ప్రమాదాలు, బంధుమిత్రులతో విరోధాలు ఉండొచ్చు.
డిశంబర్ 2025
ఈ నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ ఆర్థికంగా నష్టపోతారు. గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. చాలా కోపంగా ఉంటారు. ఇతరులు ఎంత శాంతంగా మాట్లాడినా మీరు ఉద్రేకపూరితంగా స్పందిస్తారు. చికిత్సలు తీసుకోవాల్సి రావొచ్చు.
(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
జనవరి 2026
గడిచిన నెలలతో పోలిస్తే కొత్త ఏడాది ఆరంభం తులా రాశివారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగంలో రాణిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఇంట్లో సంతోషం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు.
ఫిబ్రవరి 2026
ఈ నెలలో మీకు అన్ని విధాలుగా బావుంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. గౌరవం పెరుగుతుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
మార్చి 2026
తులా రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆఖరి నెల అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, కళాకారులకు అందరకీ లాభమే. వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి.
మీ నక్షత్రం , రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
(సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

