అన్వేషించండి

CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న

Revanth : ప్రజలకు తమపై కోపం ఎందుకు ఉంటుందని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనుల్ని తాము పది నెలల్లోనే చేశామన్నారు.

Telangana Cm:  ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారని.. మాపై ఎందుకు కోపమని రేవంత్ ప్రశ్నించారు.  నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా? అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా?  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకా? పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఎందుకు మాపై కోపంగా ఉంటారని రేవంత్ ప్రశ్నించారు. కొలువుల పండగలో భాగంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సభలో రేవంత్ ప్రసంగించారు. 

రేవంత్ రెడ్డికి పట్టు రాలేదని మాట్లాడుతున్నారు…రాజయ్య, ఈటెల లాంటి బలహీనవర్గాలను సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టా…అని ప్రశ్నించారు. మేం గడీలలో పెరగకపోవచ్చు… కానీ నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాం… అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు మానవత్వం లేదన్నారు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి…మేం విజ్ఞతను ప్రదర్శిస్తున్నామని ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. మిస్ యూనివర్స్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు   ...పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శించబోతున్నారు ..72 వ మిస్ యూనివర్స్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతుందని గుర్తు చేశారు. భవిష్యత్ లో వందల కోట్ల ఆదాయం రాబోతుందని స్పష్టం చేశారు. 

నియామక పత్రాలు అందుకోబోతున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.  గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలను పట్టించుకోలేదంటే.. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించాలని పిలుపునిచ్చారు. అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నామని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని నిరుద్యోగ యువత పోరాడిందన్నారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ కోసం అమరులైనవారి ఆశయాలు నెరవేరలేదన్నారు. మేం అధికారంలో రాగానే 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వంలో భర్తీ చేశాం  ..కానీ తామే నోటిఫికేషన్లు వేశామని, మేం చేసింది ఏం లేదని కొందరు మాట్లాడుతున్నారు .. పదేళ్లు  పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు.  మీ ఇంటి బిడ్డలకు పదవి పోతే ఇంకో పదవి ఇచ్చుకున్న మీకు… తెలంగాణలో ఈ పేదింటి బిడ్డల బాధ కనిపించలేదా?  పేదింటి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు? పది నెలల్లో మేం చేసిన పని… పదేళ్లలో మీరెందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. 

కేవలం పది నెలల్లో 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని.. గ్రూప్ 1, 2, 3 లలో 2వేల పైచిలుకు ఉద్యోగాలకు మరి కొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నామన్నారు.తాము చేయలేదు కాబట్టి మమ్మల్ని చేయనీయకూడదనే ధోరణిలో బీఆరెస్ తీరు ఉందన్నారు.అందుకే మా కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఒక వ్యక్తి, ఒక పార్టీ సెంట్రిక్ గా నిర్ణయాలు జరిగితే.. ఇవాళ ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే బిల్డ్ నౌ పోర్టల్ ను తీసుకొచ్చామని.. ఎంతటివారైనా సరే ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాల్సిందేనననారు.ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే మా ఉద్దేశం.. అదే నన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Dil Raju: 'మార్కో' దర్శకుడితో దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్... పాన్ ఇండియా మల్టీస్టారర్‌కు సన్నాహాలు
'మార్కో' దర్శకుడితో దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్... పాన్ ఇండియా మల్టీస్టారర్‌కు సన్నాహాలు
Vijay Deverakonda: ఇల్లీగల్ ప్రచారం చేయలేదు... ఇప్పుడు ఆ కంపెనీతో సంబంధం లేదు... బెట్టింగ్ యాప్స్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్
ఇల్లీగల్ ప్రచారం చేయలేదు... ఇప్పుడు ఆ కంపెనీతో సంబంధం లేదు... బెట్టింగ్ యాప్స్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్
Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Embed widget