అన్వేషించండి

TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి

Tirumala: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖలకు అనుమతి ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 24 నుంచి అనుమతించనున్నారు.

TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించడం లేదని నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు టీటీడీ పరష్కారం చూపింది. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తుంది. వారి సిఫారసుపై దర్శన టిక్కెట్లను కేటాయిస్తుంది. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇస్తారు. ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పిస్తారు.

ఇటీవల తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదన్నారు. కొండా సురేఖ చంద్రబాబుకు లేఖ రాశారు. రఘునందన్ రావు తిరుమలలో  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లేఖలను అనుమతిస్తూ ఉత్తర్వాలు జారీ చేశారు.   

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుకోవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు.   టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ  బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.                            

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఓ లేఖను చంద్రబాబుకు రాశారు.  రేవంత్ లేఖకు స్పందించిన చంద్రబాబు  గత ఏడాది డిసెంబర్ లో    తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు  అంగీకరించారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల  వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. .                           

శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని  తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేఖలకు అనుమతిస్తాన్నారు. అయితే ఇప్పటి వరకూ అమలులోకి రాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. వారి అనుచరులు సిఫారసు లేఖలు అడుగుతూండటంతో..  టీటీడీపై తెలంగాణ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget