అన్వేషించండి

Viral News: "గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

Viral News: జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఓ బామ్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉత్తారంధ్ర యాసలో ఆమె చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి.

Viral News: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే పేరు వినిపిస్తోంది. అదే పవన్ కల్యాణ్. ఒకప్పుడు కేవలం సినిమా హీరోగా మాత్రమే తెలిసిన ఆయన పార్టీ పెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మరింత దగ్గరయ్యారు.  అలాంటి పార్టీ నేడు వార్షికోత్సవం జరుపుకుంటోంది. దీన్ని గిరిజనుల మధ్య పవన్ సెలబ్రేట్ చేసుకొని ప్రత్యేకత చాటుకున్నారు. అలాంటి పార్టీని అభిమానించే ఓ బామ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 
 
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడున్నంత సానుకూలంగా పరిస్థితులు లేవు. కొందరు ఆయన రాజకీయ ప్రవేశంపై ఎగతాలి చేశారు. సినిమా స్టార్ కదా రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. తక్కువ చేసి మాట్లాడారు. ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కానీ పవన్ దేనికీ వెనకడుగు వేయలేదని బామ్మ చెప్పుకొచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. " మన రెండు రాష్ట్రాల ప్రజలకి ఒక విజ్ఞప్తి. ఒక మంచి మాట చెప్తున్నాను. మా పవన్ బాబు ఈ పార్టీని పెట్టినప్పుడు ఎంతో జనం విమర్శించారు. యాలాకోలం(ఎగతాళి) చేశారు. ఎన్నో అన్నారు. వాటిని పడుతూ ఎదరించుకొని ఒక్కో మెట్టు ఎక్కాడు. నల్లమల అడవులోని పెద్ద పులై నిలబడ్డాడు దిస్‌ ఈజ్ పవన్ కల్యాణ్. పవన్ ఆరుడుగుల బుల్లెట్‌ బుల్లెట్ అంటే తెలియన వారు పవన్‌ను చూడండి."

నల్లమల అడవిలో పెద్ద పులిలా

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు గొప్పగా వర్ణిస్తారు. అందుకే బామ్మ పవన్‌ను పెద్దపులితో పోల్చారు. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత మంది శత్రువులు చుట్టుముట్టినా, ఒంటరిగా పోరాడే ధైర్యం ఆయన సొంతం అని వారి నమ్మకం. అందుకే ఆయనను ఆరుడుగల బులెట్ అని పిలిచారు. 

విమర్శకులనే మిత్రులుగా మార్చుకునే గుణం 

రాజకీయాల్లో శత్రువులు ఉండటం సహజం కానీ పవన్ కల్యాణ్ ప్రత్యేకత ఏంటంటే, తనను విమర్శించే వారిని కూడా తన మంచి మనసుతో మార్చుకోవాలని ఆయన కోరుకుంటారని బామ్మ చెప్పారు. తప్పుడు దారిలో ఉన్న వారిని, తనను ద్వేషించే వారిని కూడా మంచి మార్గంలోకి మళ్లించి, తన వైపు తిప్పుకోవాలని సంకల్పం ఆయనదని వివరించారు. కుట్రలు చేసే వారు ఎన్ని ఎత్తులు వేసినా, నక్కజిత్తుల్లాంటి ప్లాన్లు వేసినా అవేవీ జనసేన ఎదుగుదలను ఆపలేవని బామ్మ అన్నారు. 
 
" ఎవరు ఎన్ని ఎత్తులపై ఎత్తు వేసినా నక్కజిత్తుల్లాగ మీరు చూసుకొని ఉండటమే. మా పార్టీ ఎదుగుతూ ఉండటమే. ఎన్ని విమర్శించినా, పగోడినైనా మంచోడిగా మలచి మా పక్కి తిప్పుకుంటాం. మాకు అంతా మంచి మనసు ఇచ్చాడు మా పవన్ బాబు. అయన్ని చూసి చాలా నేర్చుకున్నాం. ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం. మీరంతా ఎంత ఉడికిపోయినా, మేమంతా ఊపిరి ఉన్నంత వరకు జనసేనతోనే ఉంటాం. తగ్గుడెందుకు తలవంచుడెందుకు ఆడెవ్వడైతేనేరా మా గుండె ఉండగా దమ్ము నిండి ఉండగా ఎదురించి ఎగరెయ్యాలి జెండా జై జనసేన" అంటూ బామ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Qualifications: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Hum Safar Weekly Express Timings: శ్రీకాకుళం రోడ్ -తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం- టైమింగ్స్ ఇవే!
శ్రీకాకుళం రోడ్ -తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం- టైమింగ్స్ ఇవే!
AP Matsyakara Bharosa 2026: మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే
మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth letter to Modi: నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
Nashik BPO Scandal: TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
Bihar CM Update: బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
Dacoit Review : డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
Chandrababu letter: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
Indian Parliament: భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
Embed widget