అన్వేషించండి

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

HPV Vaccine India: ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో ప్రారంభించగా, తెలుగు రాష్ట్రాల్లో ఇది పండుగలా మొదలైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీఎంలు, మంత్రుల చేతుల మీదుగా టీకా కార్యక్రమం మొదలైంది.
  • 9-14 ఏళ్ల బాలికలకు ఉచితంగా గార్డాసిల్-4 వ్యాక్సిన్ అందిస్తున్నారు.
  • తల్లిదండ్రులు పిల్లలకు భోజనం తినిపించి, అరగంట పర్యవేక్షణలో ఉంచాలి.

HPV Vaccine India: మన దేశంలో మహిళల ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చారిత్రాత్మకమైన ముందడుగు వేశాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్‌పీవీ వ్యాక్సినేన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. ఈ టీకా కార్యక్రమం మన ఇంటి ఆడ బిడ్డలకు భవిష్యత్‌కు ఒక గొప్ప భరోసా అని చెప్పవచ్చు. 

ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో ప్రారంభించగా, తెలుగు రాష్ట్రాల్లో ఇది పండుగలా మొదలైంది. 

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ప్రతీ బాలికకు హెచ్‌పీవీ వ్యాక్ిన్‌ వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు.  ఆరోగ్యం అనేది కేవలం మందుల వల్ల వచ్చేది కాదని, అది ఆనందాన్ని, ఆదాయాన్ని ఇస్తుందని చెప్పారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతోంది, అందుకే ముందస్తు జాగ్రత్త అవసరం అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం బడ్జెట్‌లో 19వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాక్సిన్లు పాడవకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ చైన్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. 

హైదరాబాద్‌లోని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు నెలల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మందికి టీకా వేస్తామని వివరించారు. మొదటి నెలలో అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు,సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా లభిస్తాయి. ఇది ఒకే డోసు ఎడమ చేతికి వేస్తారు. టీకా వేసిన తర్వాత గుర్తుగా వేలికి మార్క్ పెడతారు. యూ-విన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ కుదరని వారు నేరుగా సెంటర్‌కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 

Image

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళలను ఎక్కువగా వేధించే సమస్య. ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆ క్యాన్సర్‌ రాకుండా జీవితాంతం రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం 9నుంచి  14 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఈ టీకాను ప్రభుత్వం అందిస్తోంది. ఈ వయసులో టీకా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయట ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయల ఖరీదు చేసే ఈ గార్డాసిల్-4 వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా అందిస్తోంది. 

తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు 

ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. వాటిని తల్లిదండ్రులు కచ్చితంగా పాటించాలని సూచించింది. టీకా వేయించుకునే పిల్లలు కచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని అన్నారు. ఖాళీ కడుపుతో రావద్దని సూచించారు. టీకా వేసుకున్న ఒక అరగంట పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. టీకా వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుందని, జ్వరం కూడా రావచ్చని చెప్పారు. అలర్జీలు ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా సరే టీకా వేయించుకోవద్దని సూచిస్తున్నారు. 

Frequently Asked Questions

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం అందిస్తున్న టీకా పేరు ఏమిటి?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వ్యాక్సిన్‌ను అందిస్తోంది. దీనిని గార్డాసిల్-4 అని కూడా అంటారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎవరికి అందిస్తున్నారు?

ప్రస్తుతం 9 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ వయసులో టీకా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఎక్కడ అందుబాటులో ఉంటుంది?

మొదటి నెలలో అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా లభిస్తాయి.

టీకా వేయించుకునే ముందు తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు ఏమిటి?

టీకా వేయించుకునే పిల్లలు టిఫిన్ లేదా భోజనం చేసి రావాలి, ఖాళీ కడుపుతో రాకూడదు. టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget