అన్వేషించండి

HPV Vaccine : HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 

HPV Vaccine: 14 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులు కూడా HPV వ్యాక్సిన్ వేసుకోవచ్చా అంటే అవును అనే సమాధానం వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని అనేక అధ్యయనాలు గుర్తించాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గర్భాశయ క్యాన్సర్ భారత్ లో మహిళల్లో ఆందోళనకరం, లక్షమందికిపైగా వ్యాధిగ్రస్తులు.
  • హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ క్యాన్సర్ ప్రధాన కారణం.
  • HPV టీకా 14 ఏళ్ల బాలికలకు ఉచితం, 45 ఏళ్ల వరకు తీసుకోవచ్చు.
  • పురుషులు కూడా HPV టీకా తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.
HPV Vaccine : భారత్‌లో మహిళలకు సంబంధించి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అత్యంత ఆందోళనకరమైన సమస్య. 15 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపిస్తున్న రెండో క్యాన్సర్ రకం ఇదే. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రతీ ఏటా భారత దేశంలో సుమారు లక్షమందికిపైగా మహిళలు ఈ వ్యాధి భారిన పడుతున్నారు. ఇందులో యాభై వేల మందికిపైగా మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. గర్భాశయం కింది భాగం, యోనితో కలిసే చోటును సర్వీక్స్ అంటారు. ఇక్కడ వచ్చే క్యాన్సర్‌ సాధారంగా 30 ఏళ్లు పైబడిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 

ఈ క్యాన్స్‌కు కారణం ఏంటీ? 

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణం హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ప్రపంచవ్యాప్తంగా 95 శాతానికిపైగా గర్భాశయ క్యాన్సర్‌ కేసులు లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే హెచ్‌పీవీ వైరస్‌ వల్లనే వస్తున్నాయి. ఈ వ్యాధి భారినపడుతున్న మహిళల్లో 90 శాతం మంది అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చెందిన వారే. 

హెచ్‌పీవీ రకాలు- వ్యాప్తి

హెచ్‌పీవీ అనేది 200 కంటే ఎక్కువ వైరస్‌ల సమూహం. వీటిలో 40 రకాల వైరస్‌లు నేరుగా లేంగిక సంబందాల ద్వారా వ్యాపిస్తాయి. హెచ్‌పీవీలో కొన్ని రకాలు జననేంద్రియ మొటిమలను కలిగిస్తే, మరికొన్ని రకాలు క్యాన్సర్‌కు దారితీస్తాయి. కేవలం గర్భాశయ క్యాన్సర్‌కే కాకుండా ఈ వైరస్‌ గొంతు, యోని, పురుషాంగం, మలద్వార క్యాన్సర్లకు కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా హెచ్‌పీవీ 16, 18 రకాలు 70శాతం గర్భాశయ క్యాన్సర్లకు ప్రధాన కారకాలు. అదనంగా 31, 33, 45, 52, 58 రకాలు మరో పది నుంచి 20 శాతం క్యాన్సర్‌ కేసులకు కారణమవుతాయి. 

నివారణ మార్గాలు- 

గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి అత్యంత ప్రభావంతమైన మార్గం టీకా వేయించుకోవడం. మార్కెట్‌లో చాలా రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ఆ పైవారు కావాలంటే ఆసుపత్రికి వెళ్లి అడిగితే టీకా వేస్తారు.  వైరస్‌ బారిన పడక ముందే ఈ టీకాలు తీసుకోవడం వల్ల దాదాపు అన్ని రకాల గర్భాశయ క్యాన్సర్లు నివారించవచ్చు. 

టీకా ఎలా పని చేస్తుంది?

ఈ టీకాలో ఎల్‌ ప్రోటీన్ ద్వారా తయారైన వైసర్ ‌లైక్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి వైరస్‌ను పోలి ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్‌ కలిగించవు. ఇవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధక శక్తిని ప్రేరేపించి, అసలైన వైరస్‌ వచ్చినప్పుడు దాడి చేస్తాయి. ఆ విధంగా బాడీని రక్షిస్తాయి. 

14 ఏళ్ల దాటిన మహిళలు వేసుకోవచ్చా?

దేశవ్యాప్తంగా శనివారం నుంచి HPV వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా బాలికలకు అందిస్తోంది. గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు ఈ డ్రైవ్ చేపట్టింది. మొదటి దశలో 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ 14 ఏళ్లు దాటిన మహిళలు కూడా వేసుకోవచ్చా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది. దీనికి వైద్యులు అవును అని సమాధానం చెబుతున్నారు. HPV వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 45 ఏళ్లు వచ్చే వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 

పురుషులకు అవసరమా

పురుషులు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. పురుషుల టీకా తీసుకోవడం వల్ల వారు వైరస్ వాహకాలుగా మారకుండా ఉంటారు. తద్వారా మహిళలకు వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది. 
 
HPV వ్యాక్సిన్ అత్యంత సాధారణ దుష్ప్రభావాలు ఇంజెక్షన్ సైట్ వద్ద నొప్పి, వాపు లేదా దద్దుర్లు మాత్రమే. ఇంజెక్షన్ తర్వాత కొన్నిసార్లు మైకం రావచ్చు. అంటే వ్యక్తి నీరసంగా ఉంటే ఇలాంటి జరగొచ్చు. అందుకే ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత 15 నిమిషాలు కూర్చుని ఉండటం మంచిది. మరికొందరికి తలనొప్పి, వికారం, వాంతులు, అలసట లేదా బలహీనంగా అనిపించవచ్చు. 

HPV వ్యాక్సిన్ ఎవరు వేయించుకోకూడదు?

గర్భధారణ సమయంలో HPV వ్యాక్సిన్ సిఫార్సు చేయరు. ఒక వ్యక్తి గతంలో HPV టీకా వేసుకున్న తర్వాత అలెర్జీ బారిన పడితే వారు టీకాకు దూరంగా ఉండాలి. మైల్డ్‌ లేదా తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు HPV టీకా తీసుకోవద్దు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత టీకా వేసుకుంటే మంచిది. 

Frequently Asked Questions

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే ఏమిటి?

గర్భాశయం కింది భాగం, యోనితో కలిసే చోటును సర్వీక్స్ అంటారు. ఇక్కడ వచ్చే క్యాన్సర్‌ను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అంటారు. ఇది 30 ఏళ్లు పైబడిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఏంటి?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణం హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్. ప్రపంచవ్యాప్తంగా 95 శాతానికిపైగా గర్భాశయ క్యాన్సర్‌ కేసులు లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే HPV వైరస్‌ వల్లనే వస్తున్నాయి.

HPV వ్యాక్సిన్ ఎవరికి సిఫార్సు చేయబడింది?

ప్రభుత్వం ఇప్పుడు 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తోంది. 45 ఏళ్లు వచ్చే వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. పురుషులు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మహిళలకు వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది.

HPV వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?

ఈ టీకాలో వైరస్‌ను పోలి ఉండే, కానీ ఇన్ఫెక్షన్‌ కలిగించని ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధక శక్తిని ప్రేరేపించి, అసలైన వైరస్‌ వచ్చినప్పుడు దాడి చేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి.

HPV వ్యాక్సిన్ ఎవరు తీసుకోకూడదు?

గర్భధారణ సమయంలో HPV వ్యాక్సిన్ సిఫార్సు చేయరు. గతంలో HPV టీకాకు అలెర్జీ వచ్చినవారు, లేదా అనారోగ్యంతో ఉన్నవారు కోలుకున్న తర్వాత టీకా తీసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget