రోజా సమయంలో

ఇంజెక్షన్లు వేసుకోవచ్చా?

Published by: RAMA

రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు ముస్లింలు..రోజా సమయంలో కఠిన నియమాలు పాటిస్తారు

మరి రోజా సమయంలో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఉపవాసం విరమించినట్టా?

ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల రోజా భంగం కాదు. అయితే దీనికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.

రోజా (ఉపవాసం) సమయంలో ప్రత్యేకించి పోషకాలు లేని కేవలం చికిత్స కోసం తీసుకునే ఇంజెక్షన్లు తీసుకుంటే రోజా భంగం కాదు

ఆహారానికి బదులుగా తీసుకునే గ్లూకోజ్ వంటి ఇంట్రావీనస్ (IV) ద్రవాలు రోజాను విచ్ఛిన్నం చేస్తాయి

ఎందుకంటే ఈ రకమైన ఇంజెక్షన్ తినడానికి , త్రాగడానికి తీసుకునేదిగా పరిగణిస్తారు

ఆహారం అందించే ఇంజెక్షన్లను ఇఫ్తార్ తర్వాత లేదా సహరీకి ముందు వేయించుకోవచ్చు.

ఇన్సులిన్, కంటి/చెవి చుక్కలు, వ్యాక్సిన్ సంబంధిత ఇంజెక్షన్లు తీసుకోవచ్చు.