అన్వేషించండి

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు

Bad Habits To Quit Before 40 : మీరు నలభైల్లోకి ఎంటర్ అవుతున్నారా? అయితే ఇప్పుడే మీ లైఫ్ స్టైల్ మార్చేసుకోండి. లేదంటే తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అంటున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 40కి ముందు ఆరోగ్యకర అలవాట్లతో మెరుగైన భవిష్యత్తును పొందండి.
  • తగిన నిద్ర, క్రమమైన వ్యాయామంతో పాటు ఆహార జాగ్రత్తలు పాటించండి.
  • ఒత్తిడి తగ్గించుకుంటూ, ధూమపానం, మద్యం పూర్తిగా మానుకోండి.
  • నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.

Health Tips Before 40 : 40 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ వయసు వచ్చేసరికి లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి, ఆరోగ్యంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఇవి శరీరంపై తీవ్రప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే 40కి చేరుకునేలోపు కొన్ని చెడు అలవాట్లను వదిలేసి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం మంచిది.

నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు

రోజులో తక్కువ గంటలు నిద్రపోవడం సాధారణ అలవాటుగా మారితే దాన్ని 40 ఏళ్లలోపు మార్చుకోవడం మంచిది. పెద్దలకు సాధారణంగా రోజుకు 7–9 గంటల నిద్ర అవసరం. నిద్రలేమి ఎక్కువకాలం కొనసాగితే గుండె ఆరోగ్యం, బరువు, రక్తంలో చక్కెర నియంత్రణ, జ్ఞాపకశక్తి వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు.

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, రాత్రివేళ కెఫీన్ తీసుకోకుండా ఉండటం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Also Read : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది

స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌

వయసు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం, బలం క్రమంగా తగ్గే సహజ ప్రక్రియను సార్కోపీనియా అంటారు. ఇది వయసు పెరిగేకొద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. కండరాల బలం తగ్గితే రోజువారీ పనులు చేయడం కష్టమవ్వడంతో పాటు శారీరక సామర్థ్యం కూడా తగ్గవచ్చు.
అందుకే 40కి ముందే వారానికి కనీసం 2–3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం అలవాటు చేసుకోవచ్చు. స్క్వాట్స్, పుష్‌అప్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు లేదా బరువులు ఎత్తే వ్యాయామాలపై ట్రైనింగ్ తీసుకోవాలి.

ప్యాకేజ్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ స్నాక్స్‌కు నో చెప్పండి

చిప్స్, కుకీస్, కేకులు, షుగర్ ఎక్కువగా ఉన్న పానీయాలు, ఇతర అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తరచూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో అదనపు చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన పిండి, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వీటిని తరచూ తినడం బదులుగా పండ్లు, నట్స్, విత్తనాలు, పెరుగు, ఉడికించిన శనగలు వంటి పోషకమైన స్నాక్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఇంట్లో హెల్తీ స్నాక్స్ సిద్ధం చేసుకోవడం కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోండి

ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో కొంత ఒత్తిడి సహజమే. కానీ దీర్ఘకాలిక ఒత్తిడిని సాధారణ జీవనశైలిగా మార్చుకోవడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒత్తిడి నిద్ర, మానసిక ఆరోగ్యం, రక్తపోటు వంటి వాటిపై ప్రభావం చూపవచ్చు. 
అందుకే ప్రతిరోజూ కొంత సమయాన్ని ఒత్తిడి తగ్గించుకునేందుకు కేటాయించాలి. నడక, యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, జర్నలింగ్, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి పద్ధతులు ఉపయోగపడవచ్చు.

Also Read : తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు

రోజంతా కూర్చోకండి..

ఆఫీస్ పని లేదా ఇంటి పని కారణంగా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం నేటి జీవనశైలిలో సాధారణమైపోయింది. కానీ శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండే జీవనశైలిని 40 తర్వాత కూడా కొనసాగించడం మంచిది కాదు.
ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే మధ్యమధ్యలో లేచి నడవడం, మెట్లు ఉపయోగించడం, రోజువారీ నడకను పెంచడం, వారానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి చిన్న మార్పులు చేయవచ్చు.

హెల్త్ చెకప్స్

ఏ సమస్యా లేదు కాబట్టి హెల్త్ చెకప్ అవసరం లేదు అనుకోకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు ఇవ్వకపోవచ్చు. అందుకే వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడి సలహాతో బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం మంచిది. అవసరమైన ఇతర స్క్రీనింగ్ పరీక్షలను కూడా వైద్యుల సూచన మేరకు చేయించుకోవాలి.

Also Read : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ధూమపానం, మద్యం వద్దు

40 ఏళ్లకు చేరుకునేలోపు మానేయాల్సిన ముఖ్యమైన అలవాట్లలో ధూమపానం కూడా ఒకటి. సిగరెట్, బీడీ లేదా ఇతర పొగాకు ఉత్పత్తులు గుండె, ఊపిరితిత్తులు సహా శరీరంలోని అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
అలాగే మద్యం తీసుకునే వారు దాని పరిమాణాన్ని తగ్గించడం లేదా మానేయడం మంచిది. వారానికి ఒకసారి మాత్రమే అని తీసుకోవడం కూడా ఆరోగ్యకరమైన అలవాటు కాదు.

40 ఏళ్లు వచ్చిన తర్వాతే ఆరోగ్యం గురించి ఆలోచించాలి అనుకోకూడదు. 40కి ముందే నిద్ర, ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, చెకప్‌లు వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. మీ పూర్తి ఆరోగ్యం దీర్ఘకాలం మెరుగ్గా ఉంటుంది. వీటిని ఫాలో అయితే వయసును ఆపలేకపోవచ్చు కానీ వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కచ్చితంగా తగ్గించుకోగలుగుతారు.

Also Read : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget