అన్వేషించండి

Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Oral Health and Fertility : నోటి ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మహిళల్లో ప్రెగ్నెన్సీ సమస్యలు పెరుగుతాయని.. తాజా అధ్యయనం తెలిపింది. అసలు నోటి ఆరోగ్యం సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Oral Inflammation Linked to Egg Quality : దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం అనేది నోటికి మాత్రమే పరిమితమైన సమస్యగా చూస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి కూడా సంబంధించినది అని నిపుణులు చెప్తారు. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఇది మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. తాజాగా చేసిన ఓ స్టడీలో నోటిలో దీర్ఘకాలిక వాపు ఉంటే.. అది శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించారు. ఇది అండం పనితీరు, నాణ్యతపై కూడా ప్రభావం చూపించవచ్చని తెలిపారు. 

తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడమే మహిళల్లో వంధ్యత్వ సమస్యలు పెరగవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు డెంటల్ ఇంప్లాంట్‌లతో సంబంధం ఉన్న వాపును పరిశీలించారు. నోటిలోని వాపు చిగుళ్ళు లేదా దంతాలకే పరిమితం కాదని.. అది ఉత్పత్తి చేసే రోగనిరోధక సంకేతాలు శరీరం అంతటా వ్యాపించి

అండాశయాలను కూడా చేరుకోగలవని పరిశోధనలో వెల్లడైంది.
నోటిలోని వాపు వల్ల అండాశయాలలో వాపును కలిగించే రసాయనాల స్థాయిలు పెరుగుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. అలాగే రోగనిరోధక కణాలలో మార్పులు, ఆక్సీకరణ ఒత్తిడి, అండాశయ కణజాలానికి నష్టం వంటి ప్రభావాలు కూడా పెరుగుతున్నాయట. 

అండం నాణ్యతలో మార్పులు

పరిశోధకుల ప్రకారం.. వాపు అండాశయాలలోని ఫోలికల్స్‌ను కూడా ప్రభావితం చేసింది. ఫోలికల్స్ అనేవి అండాలు అభివృద్ధి చెందే చిన్న బ్యాగ్స్. నోటిలోని వాపు వల్ల ఈ ఫోలికల్స్ అభివృద్ధి దెబ్బతింటుంది. అలాగే అండం నాణ్యత కూడా క్షీణించినట్లు పరిశోధనలో వెల్లడైంది.

అంతేకాకుండా అండాలలోని DNA దెబ్బతినడం, ఎపిజెనెటిక్ మార్పులు జరిగినట్లు కనుగొన్నారు. అంటే ఇవి జన్యువులు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేసే మార్పులు. ఇటువంటి మార్పులు మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఇదే..

ఈ పరిశోధనలో వెల్లడైన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అండాలలో గమనించిన మార్పులు.. వయసు పెరిగే కొద్దీ మహిళల సంతానోత్పత్తి సామర్థ్యంలో సహజంగా సంభవించే మార్పులను చాలా వరకు పోలి ఉన్నాయి. దీర్ఘకాలిక వాపు, సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణించే ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. 

మొత్తం ఆరోగ్యంపై ప్రభావం

వాపును తరచుగా ఒక నార్మల్ సమస్యగా పరిగణిస్తారు. కానీ పరిశోధన ఫలితాలు ఇది పునరుత్పత్తి వ్యవస్థతో సహా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయగలదని చెప్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గత కొన్నేళ్లుగా జరిగిన అనేక అధ్యయనాలు నోటి ఆరోగ్యానికి, మొత్తం ఆరోగ్యానికి మధ్య బలమైన సంబంధం ఉందని వెల్లడించాయి. పీరియాంటైటిస్ వంటి తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి, గుండె జబ్బులు, మెదడు సమస్యలు, జీవక్రియ లోపాలకు సంబంధం ఉన్నట్లు ఇప్పటికే తేలింది.

గుర్తించుకోవాల్సిన అంశం

తాజాగా పునరుత్పత్తి ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చని కొత్త పరిశోధన తెలిపింది. ప్రస్తుత పరిశోధన జంతువులపై నిర్వహించారు. కాబట్టి ఖచ్చితమైన నిర్ధారణకు రాకూడదు. మరిన్ని అధ్యయనాలు.. మానవులపై వైద్య పరిశోధన అవసరం కూడా ఉందని శాస్త్రవేత్తలు మరీ చెప్తున్నారు. అలాగే నోటి ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకోవద్దని సూచిస్తన్నారు. 

ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget