అన్వేషించండి

Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు

Drinking Water the Right Way : చాలామంది రోజంతా నీరు తాగుతారు. అలాగే ఎన్ని గ్లాస్​లు తాగామనేది చూసుకుంటారు కానీ.. ఎప్పుడు తాగాము అనేది పట్టించుకోరు. కానీ అది కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగండి.
  • భోజనానికి అరగంట ముందు నీళ్లు ఆకలిని నియంత్రిస్తాయి.
  • వ్యాయామానికి ముందు, తర్వాత నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
  • దాహం వేయకపోయినా, రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగాలి.

Best Times to Drink Water Throughout the Day : నీళ్లు శరీరానికి అత్యంత అవసరమైనవి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం నుంచి జీర్ణక్రియ, రక్త ప్రసరణ, టాక్సిన్స్ బయటకు పంపించడం వరకు అనేక పనుల్లో కీలక పాత్ర పోషిస్తుంది నీరు. ఈరోజుల్లో చాలామంది నీళ్లు ఎంత తాగాలి అనే విషయంపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ నీళ్లు ఎప్పుడు తాగాలి అన్నది కూడా అంతే ముఖ్యమని అంటున్నారు నిపుణులు. సరైన సమయంలో నీళ్లు తాగితే శరీరానికి మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనిపై కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు.

ఉదయం నిద్రలేవగానే 

రాత్రంతా శరీరం నీరు తీసుకోకుండా ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది మెటాబాలిజాన్ని యాక్టివేట్ చేయడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కొందరిలో మలబద్ధకం తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. 

భోజనానికి ముందు 

భోజనం చేయడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు నీళ్లు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు కూడా మంచిది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా ఉపయోగకరమైన టిప్​గా చెప్తున్నారు నిపుణులు.

భోజనం చేసిన వెంటనే 

తిన్న వెంటనే చాలామంది ఎక్కువగా నీళ్లు తాగుతారు. ఇలా చేయడం వల్ల జీర్ణరసాలు పలుచబడతాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే భోజనం చేసిన వెంటనే కాకుండా కొద్దిసేపటి తర్వాత నీళ్లు తాగడం మంచిదని సూచిస్తున్నారు.

వ్యాయామానికి ముందు

వ్యాయామం చేసే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటుంది. అలాగే వ్యాయామం తర్వాత చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి నీళ్లు అవసరం. ముఖ్యంగా వేసవిలో ఇది మరింత ముఖ్యమైన అంశం. 

దాహం వేయకపోయినా..

చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు. కానీ దాహం అనిపించే సమయానికి శరీరం కొంత డీహైడ్రేట్ అయి ఉండొచ్చు. అందుకే రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండడం మంచిదని చెప్తున్నారు నిపుణులు.

నిద్రకు ముందు 

రాత్రుళ్లు నిద్రపోయే ముందు ఎక్కువగా నీళ్లు తాగితే మధ్యరాత్రిలో పదే పదే మూత్రానికి లేవాల్సి రావచ్చు. దీంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అయితే పూర్తిగా నీళ్లు మానేయడం కూడా మంచిది కాదు. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే తీసుకోవాలి.

ఎంత తాగాలి?

ప్రతి ఒక్కరికీ నీటి సామర్థ్యం ఒకేలా ఉండదు. వారు ఉండే ప్రదేశం, వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను ఈ కొలత మారుతుంది. సాధారణంగా రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తారు. అయితే కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నీటి పరిమాణాన్ని డిసైడ్ చేసుకోవాలి. నీళ్లు సరైన సమయంలో, సరైన పరిమాణంలో తాగడం వల్ల శరీరం చురుకుగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget