అన్వేషించండి

Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Rising Summer Heat : తీవ్రమైన ఎండల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే డీహైడ్రేషన్​కు గురై.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల తీవ్రత, డీహైడ్రేషన్ ప్రమాదాలు.
  • డీహైడ్రేషన్ లక్షణాలు: అధిక దాహం, తల తిరగడం, మూత్రం తగ్గుదల.
  • రోజుకు 3-4 లీటర్ల నీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తాగాలి.
  • వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు, వైద్యుల సలహా తీసుకోవాలి.

Stay Safe in Extreme Heat : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి, ఉక్కపోత తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఈ ప్రభావానికి ఎక్కువగా దీని బారిన పడతారు కాబట్టి.. సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. మరి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే డీహైడ్రేషన్ తగ్గుతుందో చూసేద్దాం. 

డీహైడ్రేషన్

శరీరానికి అవసరమైనంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇది తలనొప్పి, అలసట, తల తిరగడం, బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది. పట్టించుకోకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. 

డీహైడ్రేషన్ సంకేతాలు..

మీ శరీరం డీహైడ్రేషన్​కి గురైతే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఎక్కువ దాహం వేయడం, నోరు ఎండిపోవడం, తల తిరగడం, మూత్రం తగ్గిపోవడం లేదా గాఢ రంగులో మారడం డీహైడ్రేషన్ లక్షణాలుగా చెప్తారు. 

డీహైడ్రేషన్ నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే.. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అలాగే దాహం లేకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా.. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు వంటివి కూడా రొటీన్​లో భాగంగా తీసుకోవాలి. పుచ్చకాయ, కీర, ఖర్బూజ, సొరకాయ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండేలా చూసుకోండి. బయటకు వెళ్లాల్సి వస్తే వెంట నీళ్లు తీసుకెళ్లండి. ఎప్పుడైనా తాగేందుకు వాటర్ బాటిల్ ఉండాలి. కాటన్, తేలికపాటి డ్రెస్​లు వేసుకోవడం వల్ల చెమట తక్కువగా ఉంటుంది. అలాగే కాఫీ, టీలు తగ్గించాలి. లేదంటే అవి శరీరంలోని నీటిని పూర్తిగా తగ్గిస్తాయి. ORS వంటివి అవసరమైనప్పుడు ఉపయోగించాలి. ఇవి శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందిస్తాయి. 

వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవికాలంలో వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలి. బీపీ, షుగర్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎండలో ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. 

చిన్నపిల్లల కోసం 

పిల్లలకు తల్లిదండ్రులు తరచూ నీళ్లు, పాలు ఇవ్వాలి. ఎండ సమయంలో బయట ఆటలు ఆడకుండా చూసుకోవాలి. లైట్ ఫుడ్స్ ఇవ్వాలి. చెమట ఎక్కువైతే డీహైడ్రేషన్​ గురికాకుండా.. నీళ్లు, ఇంట్లో చేసిన పళ్ల రసాలు ఇవ్వాలి.

ఆహారంలో చేయాల్సిన మార్పులు

తినే డైట్​లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసకోవాలి. ఉప్పు, మసాలా తక్కువగా తీసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్స్ మాత్రమే తినాలి. హైడ్రేటింగ్ ఫుడ్స్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget