అన్వేషించండి

Muscle Strain : మసిల్ స్ట్రెయిన్ అంటే ఏమిటి? కండరాలు బెణికినప్పుడు తీసుకోవాల్సిన పూర్తి జాగ్రత్తలు ఇవే

Prevention Tips of Muscle Strain : మసిల్ స్ట్రెయిన్ చిన్న సమస్యలా కనిపించినా… సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది కండరాలకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కండరాల బెణుకు, నొప్పి, వాపు, నడవడంలో ఇబ్బంది లక్షణాలు.
  • వెంటనే RICE పద్ధతి (విశ్రాంతి, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్) పాటించాలి.
  • నొప్పి తగ్గితే ఫిజియోథెరపీ, స్ట్రెచింగ్, సరైన ఆహారం తీసుకోవాలి.
  • వ్యాయామం ముందు వార్మ్-అప్, ఫ్లెక్సిబిలిటీ, నీరు తాగడం ముఖ్యం.

Pulled a Muscle Recovery Guide : రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా కండరాలు పట్టేసి.. లాగినట్టుగా అనిపించి నొప్పి రావడం జరుగుతుంది. దీనినే మసిల్ స్ట్రెయిన్ (Muscle Strain) అంటారు. లేదా Pulled Muscle అని కూడా అంటారు. అయితే ఇది చిన్న సమస్యలా కనిపించినా.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ఇబ్బందులకు దారి తీస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా కాలు బెణికి.. మళ్లీ వెనక్కి వచ్చేసినా.. ఇలా రెగ్యులర్​గా జరగడం మంచిది కాదని అంటున్నారు. ఇలా జరగడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. నిపుణుల సూచనలు ఏంటో చూసేద్దాం.  

కాలు (కండరాలు) బెణకడం 

కాలులోని మసిల్ లేదా కండరాన్ని ఎముకకు కలిపే భాగం (టెండన్) ఎక్కువగా లాగడం లేదా చిన్నగా చీలిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఎక్కువగా కాలి కండరాల్లో జరుగుతుంది. కానీ వెన్ను, భుజాలపై కూడా దీనిప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మసిల్ స్ట్రెయిన్‌కు కారణాలు

సరిగ్గా వార్మ్-అప్ చేయకుండా జిమ్ చేయడం, ఒక్కసారిగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, కండరాలను ఎక్కువగా ఉపయోగించడం, సరిగ్గా కూర్చోకపోవడం, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వంటి మజిల్ స్ట్రెయిన్​కు కారణాలు అవుతాయి. అందుకే ఇవి అథ్లెట్స్​కి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్ చేసే వాళ్లకు కూడా వస్తాయి.

కండరాలు బెణికితే వచ్చే లక్షణాలు

మసిల్ స్ట్రెయిన్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాపు ఉంటుంది. దీంతో నడిచేప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మజిల్ స్టిఫ్‌గా అనిపించడంతో పాటు.. కొన్ని సార్లు బ్రూజింగ్ (నల్లటి మచ్చలు) వస్తాయి.

కండరాలు బెణికితే చేయాల్సిన మొదటి పని.. 

మసిల్ స్ట్రెయిన్ వస్తే వెంటనే R.I.C.E Method ఫాలో అవ్వాలి. R అంటే Rest: ఆ భాగానికి విశ్రాంతి ఇవ్వాలి. I అంటే 15–20 నిమిషాలు ఐస్ పెట్టాలి. C అంటే Compression బ్యాండేజ్‌తో కట్టాలి. E అంటే Elevation.. స్ట్రెయిన్ అయిన భాగాన్ని పైకి ఉంచాలి. ఇది వాపు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పెయిన్ రిలీఫ్ జెల్స్ లేదా మందులు ఉపయోగించవచ్చు. ఫిజియోథెరపీ, లైట్ స్ట్రెచింగ్ చేస్తే మంచిది. నొప్పి ఎక్కువైతే.. వైద్య సహాయం తీసుకోవాలి. మసిల్ స్ట్రెయిన్ రాకుండా ఉండాలంటే వ్యాయామం ముందు 5 నుంచి 10 నిమిషాలు వార్మ్-అప్ చేయాలి. మసిల్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటే గాయాలు తక్కువగా అవుతాయి కాబట్టి.. బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఒక్కసారిగా హెవీ వర్కౌట్ చేయకండి. అలాగే బరువులు ఎత్తకండి. నీరు తక్కువైతే మసిల్స్ క్రాంప్స్ వస్తాయి కాబట్టి బాగా నీళ్లు తీసుకోండి. సరైన విధంగా కూర్చోవడం, నిలబడటం కూడా ముఖ్యమే.

నొప్పి ఎక్కువగా ఉంటే 2,3 రోజుల్లో తగ్గకపోతే వాపు పెద్దగా ఉంటే వైద్య సహాయం తీసుకోవడంతో పాటు.. డైట్లో కూడా మార్పులు చేయాలి. గుడ్లు, మెగ్నీషియం, విటమిన్ C తీసుకోవాలి. ఇవి మసిల్ రిపేర్‌ను వేగవంతం చేస్తాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget