అన్వేషించండి

BP and Diabetes Medicines : బీపీ, షుగర్ మందులు వాడుతున్నారా? అయితే టైమ్, గ్యాప్, డైట్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి

BP & Sugar Medicines Guide : బీపీ, షుగర్ మందులు వాడేప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వేసుకునే టైమ్, తినాల్సిన ఫుడ్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రక్తపోటు, మధుమేహం మందులు వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.
  • మందులు వేసుకునే సమయం, ఆహారంతో గ్యాప్ పాటించడం ముఖ్యం.
  • మందులు మిస్ చేయరాదు, ఒకేసారి రెండు వేసుకోకూడదు.
  • ధూమపానం, మద్యపానం మానేసి, సరైన జీవనశైలి అవలంబించాలి.

BP and Diabetes Care : నేటి జీవనశైలిలో హై బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చిన్నా, పెద్ద తేడాలేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరికొందరిలో ఈ రెండూ సమస్యలు ప్రధానంగా ఉంటాయి. వీటిని అదుపులో ఉంచుకునేందుకు వైద్యులు మందులు సూచిస్తారు. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయి. ఈ మందులను సరైన విధంగా తీసుకోకపోతే ప్రయోజనం తగ్గిపోవడమే కాకుండా.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే బీపీ, షుగర్ మందులు తీసుకునేప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. అవేంటంటే..

మందులు వేసుకునే సమయం

మీరు బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడాలనుకుంటే కచ్చితంగా వైద్యులు సూచనలే ఫాలో అవ్వాలి. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి బాడీ కండిషన్ వేరుగా ఉంటుంది. కాబట్టి డాక్టర్లు మీకు చెప్పిన టైమ్‌నే కచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

షుగర్ మందులు : కొన్ని షుగర్ మందులు మెట్ఫార్మిన్ వంటివి భోజనం తర్వాత తీసుకోవాలి. కొన్ని మాత్రం భోజనం చేసే ముందు తీసుకోవాలి. కాబట్టి ప్రిస్క్రిప్షన్‌ను ఫాలో అవ్వాలి.

బీపీ మందులు : బీపీ టాబ్లెట్స్‌ను ప్రతిరోజూ ఒకే సమయానికి తీసుకోవడం వల్ల బీపీ స్థిరంగా ఉంటుంది. చాలామంది ఉదయం తీసుకుంటూ ఉంటారు.

బీపీ, షుగర్ మందుల మధ్య గ్యాప్ అవసరమా?

బీపీ, షుగర్ మందులు ఒకేసారి వేసుకోవచ్చా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే వైద్యులు మీకు సూచించిన మందులపై ఈ గ్యాప్ ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఈ గ్యాప్ 30 నిమిషాలు ఉంటే సరిపోతుంది.

ఆహారం & మందుల మధ్య గ్యాప్

కొన్ని మందులు ఖాళీ కడుపుతో.. కొన్ని ఫుడ్‌తో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

మందుల విషయంలో చేయకూడని తప్పులు ఇవే.. 

రక్తపోటు, మధుమేహం మందులు ఒక్కరోజు మిస్ అయినా.. షుగర్ లేదా బీపీ పెరగవచ్చు. కాబట్టి అలారం పెట్టుకుని అయినా టైమ్‌కు వాటిని వేసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకోకపోతే.. ఒకేసారి రెండు ట్యాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇది ప్రమాదకరమని చెప్తారు. అలాగే వైద్యుల సూచనలు లేకుండా మందులు ఆపకూడదు. ఆపేస్తే పరిస్థితి విషమిస్తుంది. అలాగే ఇతరులు వినియోగించే మందులు మీరు వేసుకోకూడదు. డాక్టర్ సలహా లేకుండా వాడడం మానుకోండి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బీపీ, డయాబెటిస్ మందులు ఉపయోగించేప్పుడు.. స్మోకింగ్, ఆల్కహాల్ తాగకూడదు. ఇవి మందుల ప్రభావాన్ని తగ్గించి.. ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఉప్పు, షుగర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే BP, షుగర్ లెవల్స్‌ను రెగ్యులర్​గా మానిటర్ చేసుకోవాలి. రోజూ వాకింగ్ లేదా లైట్ ఎక్సర్‌సైజ్ చేస్తే.. మందుల ప్రభావం మెరుగవుతుంది. సమస్యలు అదుపులో ఉంటాయి. డీహైడ్రేషన్ వల్ల షుగర్, బీపీ ప్రభావితమవుతాయి. కాబట్టి నీరు తగినంత తీసుకోవాలి.

బీపీ, షుగర్ ఉన్నవారు కేవలం మందులు వాడితే సరిపోదు. సరైన సమయం, మంచి జీవనశైలి ఫాలో అవ్వడం కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయని గుర్తించి.. వాటికి దూరంగా ఉంటే రెండూ అదుపులోనే ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget