అన్వేషించండి

Chia Seeds Side Effects : చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే

Chia Seeds : చియా గింజలు తింటున్నారా? ఆరోగ్యానికి మంచివైనా.. సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు. తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చియా గింజలు ఆరోగ్యానికి మంచివే అయినా, సరిగ్గా తీసుకోకపోతే ప్రమాదం.
  • నానబెట్టకుండా తింటే గొంతులో ఇరుక్కునే ప్రమాదం, అజీర్తి సమస్యలు.
  • డయాబెటిస్, బీపీ రోగులు, గర్భిణీలు వైద్యులను సంప్రదించాలి.
  • రోజుకు 1-2 స్పూన్లు, నానబెట్టి తీసుకోవడం శ్రేయస్కరం.

Chia Seeds Guide : చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్​తో పాటు.. ప్రోటీన్ నిండుగా కలిగి ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి. బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. అందుకే వీటిని ఎక్కువ మంది డైట్లో తీసుకుంటారు. కానీ సరైన విధంగా, సరైన పరిమితిలో తీసుకోకపోతే కొన్ని ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. అందుకే చియాసీడ్స్ ఎలా తినాలి? ఎప్పుడు తింటే మంచిది.. వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూసేద్దాం.

నానబెట్టకుండా..

చియా సీడ్స్ నీటిలో నానబెట్టకుండా తీసుకుంటే.. అవి గొంతులో అతుక్కుపోతాయి. తర్వాత ద్రవాన్ని పీల్చుకుని.. ఉబ్బిపోతాయి. అవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకమవుతుంది. 

అలర్జీ సమస్యలు

కొంతమందికి చియా గింజలు తింటే తల తిరగడం, ముఖంపై వాపు, చర్మంపై దద్దుర్లు రావడం వంటి అలర్జీలు కలగవచ్చు. ఈ సమస్యలు ఉంటే చియా సీడ్స్ తినకపోవడమే మంచిది.

ప్రతికూల ప్రభావం

డయాబెటిస్, బీపీ, రక్తం పలుచగా చేసే మందులు వాడేవారు చియా గింజలు తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే ఇవి మీపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

పోషకాల శోషణ..

చియా సీడ్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి అందడాన్ని ఆలస్యం చేయవచ్చు. కాబట్టి సప్లిమెంట్స్ తీసుకునేవారు గ్యాప్ తీసుకుని చియా సీడ్స్ తీసుకోవాలి.

ప్రోస్టేట్ క్యాన్సర్‌

చియా గింజల్లో ఉండే ALA ఫ్యాటీ యాసిడ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌పై ప్రభావం చూపుతుందని కొందరు చెప్తారు. కానీ దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

కిడ్నీ సమస్యలు

చియా సీడ్స్​లో పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటంతో కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు వీటిని తీసుకుంటే మంచిది. 

జీర్ణ సమస్యలు

చియా సీడ్స్ అధికంగా తింటే గ్యాస్, బ్లోటింగ్, కడుపు నొప్పి, డయేరియా లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి. 

ఇవేకాకుండా వీటిలోని ఒమెగా-3 ఫ్యాట్స్ వల్ల రక్తం పలుచగా మారి గాయాలైతే ఎక్కువగా రక్తస్రావం కావచ్చు. ఎక్కువగా తింటే కేలరీలు పెరిగి.. బరువు కూడా పెరగవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

చియాసీడ్స్ పూర్తిగా నానబెట్టి తీసుకోవాలి. అలాగే వాటిని తీసుకున్న తర్వాత శరీరానికి నీటిని ఎక్కువ అందించాలి. లేదంటే డీహైడ్రేషన్ రావచ్చు. వీటిలోని అధికంగా ఫైబర్ థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వాటితో కలిపి తీసుకోకూడదు. గర్భిణీలు వైద్యుల సలహాతోనే వీటిని తీసుకోవాలి. 

చియా సీడ్స్ ఎలా తీసుకోవాలంటే..

చియాసీడ్స్​లో నీటిలో లేదా పాలల్లో కచ్చితంగా 20–30 నిమిషాలు నానబెట్టాలి. రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మించి తీసుకోకూడదు స్మూతీలు, ఓట్స్, జ్యూస్‌లో కలిపి తీసుకోవచ్చు. తక్కువ పరిమాణంతో స్టార్ట్ చేసి.. ఎక్కువ తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మెటబాలిజం పెరుగుతుంది. దీనివల్ల బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ఆకలి ఉండదు. వర్కౌట్ ముందు తీసుకుంటే ఎనర్జీ పెరుగుతుంది. చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. సరైన విధంగా తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. కాబట్టి పరిమితంగా, సరైన పద్ధతిలో తీసుకుంటేనే మంచిది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget