ఒంట్లో కొవ్వు పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కొవ్వు పెరిగితే ఛాతిలో నొప్పి వస్తుంది. రక్తనాళాల్లో బ్లాకేజ్ కారణంగా ఇది ఏర్పడుతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. గుండెకు రక్తప్రవాహం తగ్గితే ఇలా జరుగుతుంది.

శరీరానికి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల అలసట, బలహీనత వస్తుంది.

చర్మంపై పసుపు మచ్చలు.. ముఖ్యంగా కళ్ల చుట్టూ కనిపిస్తాయి.

రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల చేతులు, కాళ్లలో నొప్పి పెరుగుతుంది.

గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల హృదయ స్పందన వేగంగా ఉంటుంది.

అధిక బరువు పెరుగుతారు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు.

హై బ్లడ్ ప్రెజర్.. కొలెస్ట్రాల్ పెరగడంతో BP కూడా పెరుగుతుంది.

ఎక్కువకాలం పట్టించుకోకపోతే హార్ట్ అటాక్ ప్రమాదం రెట్టింపు అవుతుంది.

కొలెస్ట్రాల్ సాధారణంగా సైలెంట్‌గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మంచిది.