కిడ్నీలకు నష్టాన్ని కలిగించి.. డ్యామేజ్ చేసే అలవాట్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

నీరు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ పెరిగి.. కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.

అధికంగా ఉప్పు తినడం వల్ల కూడా BP పెరిగి.. కిడ్నీలను డ్యామేజ్ అవుతాయి.

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది.

తరచుగా మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్, కిడ్నీ సమస్యలు వస్తాయి.

జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల సోడియం, ప్రిజర్వేటివ్స్ కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి.

షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయకపోవడం వల్ల కిడ్నీలపై నెగిటివ్ ప్రభావం ఉంటుంది.

అధిక ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై అదనపు లోడ్ పెరుగుతుంది.

స్మోకింగ్ & ఆల్కహాల్.. రక్తప్రసరణను దెబ్బతీసి కిడ్నీలకు హాని చేస్తాయి.

వ్యాయామం చేయకపోవడం వల్ల ఒబెసిటీ, BP సమస్యలు పెరిగి కిడ్నీలపై ప్రభావం ఉంటుంది.

రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయకపోతే సమస్యలు ముందే గుర్తించలేము.