మునగాకు పొడి తింటే మధుమేహం తగ్గుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

మునగాకు పొడి.. ఇన్సులిన్ పనితీరు మెరుగుపరిచి.. బ్లడ్ షుగర్ తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచి.. శరీరం గ్లూకోజ్‌ను బాగా ఉపయోగించుకునేలా చేస్తుంది.

డైజెషన్ మెరుగవుతుంది. ఫైబర్ వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. వెయిట్ లాస్ అయితే షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి.. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో 1 టీ స్పూన్ మునగాకు పొడి.. గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి.

షుగర్ మందులు తీసుకునేవారు.. షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.