వంకాయలు ఎవరు తినకూడదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

వంకాయ తిన్న తర్వాత చర్మం దురద, ర్యాష్‌లు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వాటిని దూరంగా ఉంచాలి.

వంకాయ కొంతమందిలో ఎసిడిటీ పెంచి గ్యాస్, హార్ట్‌బర్న్ సమస్యలు పెంచుతుంది.

వంకాయలో ఆక్సలేట్స్ ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య పెరగొచ్చు.

అధికంగా తింటే హార్మోనల్ ప్రభావాలు ఉండొచ్చని కొంతమంది నిపుణులు సూచిస్తారు. మితంగా తీసుకుంటే మంచిది.

వంకాయ బీపీని తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి లో బీపీ ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు.

ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారికి వాటి లక్షణాలు మరింత పెరగొచ్చు.

వంకాయలోని కొన్ని పదార్థాలు ఐరన్ అబ్జార్ప్షన్‌ను తగ్గిస్తాయి.

బీపీ లేదా డిప్రెషన్ మందులు తీసుకునేవారు వంకాయ తినేముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.

బ్లోటింగ్, గ్యాస్ త్వరగా వచ్చే వారికి వంకాయ కాస్త హెవీగా అనిపించొచ్చు.

కాబట్టి వంకాయను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు సూట్ కాకపోతే మాత్రమే దూరంగా ఉండండి.