తియ్యని పుచ్చకాయ కొనాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

పుచ్చకాయపై గాఢమైన పసుపు/క్రీమ్ రంగు ఉండే మచ్చ ఉంటే అది బాగా పండిందని అర్థం.

బరువు ఎక్కువగా ఉండాలి. సైజ్‌కు తగ్గట్టు బరువుగా ఉంటే జ్యూసీగా, తీపిగా ఉంటుంది.

పుచ్చకాయను తట్టి చూస్తే.. లోపల ఖాళీగా ఉన్నట్టుగా డీప్ సౌండ్ వస్తే మంచిది.

ఆకారం సమానంగా ఉండాలి. గుండ్రంగా లేదా సమానంగా ఉంటే సరిగా పెరిగిందని అర్థం.

పై తొక్క అంత షైనీగా ఉండకూడదు. చాలా షైనీగా ఉంటే అది పచ్చిగా ఉందని అర్థం.

పుచ్చకాయపై స్ట్రిప్స్ క్లియర్‌గా ఉండాలి. గాఢమైన గీతలు ఉంటే రుచిగా ఉంటుంది.

స్టెమ్ ఎండిపోయి ఉండాలి. పచ్చగా కాకుండా డ్రైగా ఉంటే పండు పండింది, రుచిగా ఉంటుందని అర్థం.

చిన్న చిల్లు లేదా గాయాలు లేకుండా చూసుకోండి. అవి క్వాలిటీ తగ్గిస్తాయి.

మధ్యస్థ పరిమాణం ఉండేవి ఎంచుకోండి. చాలా పెద్ద లేదా చాలా చిన్న కాయలు కాకుండా మధ్యస్థంగా ఉండేవి మంచిది.

ఈ టిప్స్ ఫాలో అయితే మీరు తియ్యని, రుచికరమైన పుచ్చకాయలు ఎంచుకోవచ్చు.