వేయించిన గుమ్మడి గింజలా? పచ్చివా? ఆరోగ్యానికి ఏవి మేలు చేస్తాయి?

Published by: Geddam Vijaya Madhuri

గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

అయితే వీటిని అధికవేడిలో వేయిస్తే గింజల్లో కొన్ని యాంటీఆక్సిడెంట్లు కొంత మేర తగ్గవచ్చు.

పచ్చి గింజల్లో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు సహజ స్థితిలో ఉంటాయి.

రోస్ట్ చేయడం వల్ల గింజలకు మంచి సువాసన, కరకరలాడే టెక్స్చర్ వస్తుంది. అందువల్ల చాలామంది వీటిని తినడానికి ఇష్టపడతారు.

లైట్గా రోస్ట్ చేసిన గింజలు కొంతమందికి సులభంగా జీర్ణమవుతాయి. పచ్చి గింజలు కొందరిలో కడుపు ఉబ్బరం కలిగించవచ్చు.

వీటిలో ఉండే మంచి కొవ్వులు, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మార్కెట్లో దొరికే కొన్ని రోస్టెడ్ గింజల్లో అధిక ఉప్పు ఉంటుంది. ఇది రక్తపోటు ఉన్నవారికి అనుకూలం కాదు.

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్, మెగ్నీషియం ఉండటం వల్ల మంచి నిద్రకు సహాయపడే అవకాశం ఉంది.

రోస్ట్ చేస్తే తేమ తగ్గడం వల్ల పచ్చి గింజలతో పోలిస్తే ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండగలవు.

ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండటంతో ఆకలి త్వరగా తగ్గి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.

ఎక్కువ పోషకాలు కావాలంటే పచ్చి గింజలు మంచివి. రుచి, తినడానికి టేస్టీగా ఉండాలంటే లైట్గా వేయించినవి తీసుకోవచ్చు.