మగవాళ్లు మునగకాయలు తింటే కలిగే లాభాలు

Published by: Geddam Vijaya Madhuri

మునగలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మగవారిలో శరీర బలం, స్టామినా పెంచడంలో సహాయపడతాయి.

మునగలో ఉండే జింక్, ఐరన్ వంటి పోషకాలు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

మునగ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల స్పెర్మ్ క్వాలిటీ, మొటిలిటీ మెరుగుపడొచ్చు.

మునగను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అలసట తగ్గి శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది మంచిది.

మునగలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

మునగలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణకు కొంతమేర సహాయపడొచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో కూడా మునగ ఉపయోగపడొచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

మునగలో కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

మునగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల శరీరంలో వాపులు, కీళ్ల నొప్పులు తగ్గించడంలో కొంత మేలు చేయొచ్చు.

మునగ ఆరోగ్యానికి మంచిదే అయినా.. అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.