పచ్చి బొప్పాయి VS పండిన బొప్పాయి.. తింటే కలిగే లాభ, నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri

బొప్పాయి పచ్చిగా తిన్నా, పండినది తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే వాటి పోషకాలు, ప్రయోజనాలు కాస్త భిన్నంగా ఉంటాయి.

పచ్చి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడొచ్చు.

పచ్చి బొప్పాయి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గించడంలో ఉపయోగపడవచ్చు.

కొందరు బరువు తగ్గేందుకు డైట్‌లో పచ్చి బొప్పాయిని చేర్చుకుంటారు. ఎందుకంటే దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

గర్భిణీలు పచ్చి బొప్పాయిని ఎక్కువగా తినకూడదని వైద్యులు సూచిస్తారు. దీనిలోని లాటెక్స్ గర్భాశయ సంకోచాలను ప్రభావితం చేస్తుంది.

పండిన బొప్పాయిలో విటమిన్ C, విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పండిన బొప్పాయి చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదిగా భావిస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడొచ్చు.

గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి మేలు చేస్తుంది. దీనిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి.

పండిన బొప్పాయి సహజంగా తియ్యగా ఉంటుంది. కాబట్టి స్వీట్స్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ఆప్షన్‌గా తీసుకోవచ్చు.

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎక్కువగా తినకూడదు.

ఎందుకంటే కొందరిలో కడుపు ఉబ్బరం లేదా విరేచనాలు రావచ్చు. కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.