అన్వేషించండి

Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది

Tips to Reduce Fatty Liver : కాలేయ సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒక ప్రధాన సమస్య. అయితే దీనిని పూర్తిగా తగ్గించుకోవాలనుకుంటే రోజూ ఈ 5 టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో కాలేయంలో కొవ్వు తగ్గుతుంది.
  • ఆకుపచ్చ కూరగాయలు, గ్రీన్ టీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • చక్కెర, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కాలేయానికి ముఖ్యం.

Fatty Liver Control with Simple Tips : కాలేయ ఆరోగ్యమనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేయ ఆరోగ్యం చెడిపోతే పూర్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పైగా ఇది చాలా ప్రమాదాకరం. ఎందుకంటే కాలేయ సమస్యలు ముందుగా భయటపడవు. దీనివల్ల సమస్య తీవ్రమయ్యేవరకు గుర్తించలేము. అలాంటి సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. కానీ ఈ మేజర్ సమస్య నుంచి పూర్తి ఉపశమనం కోసం 5 టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. 

మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామందిలో ఫ్యాటీ లివర్ అనేది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో గుర్తించకపోతే.. తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే వైద్యుల ప్రకారం ఫ్యాటీ లివర్‌ను దాని ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చట. సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని పూర్తిగా దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను పాటించడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్తున్నారు. 

శారీరక శ్రమ

ఫ్యాటీ లివర్ నుంచి ఉపశమనం పొందడానికి రెగ్యులర్​గా వ్యాయామం చేయడం చాలా అవసరం. వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామాలు కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ-తీవ్రత గల వ్యాయామం చేయాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా.. ఇన్సులిన్ సెన్సిటివిటీని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల కాలేయం సరిగ్గా పనిచేస్తుంది. 

ఆహారంలో మార్పులు

పాలకూర, మెంతులు, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలు కాలేయానికి చాలా మేలు చేస్తాయని చెప్తారు. వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ కూరగాయలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నెమ్మదింపజేస్తాయి. తద్వారా ఫ్యాటీ లివర్ సమస్యలు అదుపులో ఉంటాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు కాలేయ పనితీరును మెరుగుపరచడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, పసుపు నీళ్లు తాగడం కూడా ప్రయోజనకరంగా చెప్తారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడి.. వాపును తగ్గిస్తాయి.

దూరంగా ఉండాల్సిన ఫుడ్స్

ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలలో అధిక చక్కెర, కొవ్వు పదార్థాలున్న ఆహారం కూడా మేజర్ రీజన్. కేకులు, పేస్ట్రీలు, మిఠాయిలు, స్వీట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్.. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. అందువల్ల కాలేయంపై అధిక ఒత్తిడిని నివారించడానికి, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడానికి ఈ ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించడం ముఖ్యం.

బరువు నియంత్రణ

బరువు పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల క్రమంగా బరువు తగ్గడం, దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు కండరాలను పెంచడంలో సహాయపడతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కొవ్వును కరిగించేలా చేస్తుంది. దీనివల్ల కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గి.. దాని పనితీరు మెరుగుపడుతుంది.

ఈ అలవాట్లు రెగ్యులర్​గా ఫాలో అయితే కాలేయంలో కొవ్వు కరిగిపోతుందని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఆల్కహాల్​కి దూరంగా ఉంటే కూడా మంచి ఫలితాలు చూడవచ్చని చెప్తున్నారు. ఇవి కేవలం కాలేయం కోసమే కాదు.. పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget