గుండె రంథ్రాలు మూసుకుపోవడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ధమనిలలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రవాహం ఆగుతుంది. దీనిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు.

గుండె బ్లాకేజ్ ఒక్క రాత్రిలో రాదు. ఇది దీర్ఘకాలిక చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఫలితంగానే వస్తుంది.

వైద్యుల ప్రకారం గుండె బ్లాకేజీకి ఛాతీ నొప్పి లేదా భారీ ఒత్తిడి అనుభూతిని ఇస్తుంది. ఇది అత్యంత సాధారణ లక్షణం.

ఆ నొప్పి కేవలం ఛాతీకి మాత్రమే పరిమితం కాకుండా కొన్నిసార్లు ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడ వరకు కూడా వ్యాపిస్తుంది.

సాధారణంగా నడుస్తున్నప్పుడు లేదా తేలికపాటి పని చేస్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే.. దానిని తేలికగా తీసుకోకూడదు.

ఎక్కువ రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ.

హృదయాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఎల్లప్పుడూ సరైన ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఈ లక్షణాలు ఏమి కనిపించినా.. వెంటనై వైద్య సహాయం తీసుకోండి.