ఎర్ర మిరపకాయలతో పచ్చడి.. స్టఫ్ చేసి తింటే టేస్ట్ అదుర్సే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

భారతీయ వంటలలో ఊరగాయలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన మసాలా ఊరగాయ రుచిని మరింత పెంచుతుంది.

Image Source: pixabay

వాటిలో ఎర్ర మిరపకాయల కారపు ఊరగాయ ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు.

Image Source: pixabay

మరి దీన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pixabay

ఎర్ర మిరపకాయల ఊరగాయ తయారు చేయడానికి.. ముందుగా తాజా, లావుపాటి ఎర్ర మిరపకాయలను తీసుకోవాలి.

Image Source: pixabay

250 గ్రాముల మందపాటి ఎర్ర మిరపకాయలను కడిగి 3-4 గంటల పాటు ఎండలో ఆరబెట్టండి. మధ్యలో చీల్చి గింజలను తీసివేయండి.

Image Source: pixabay

అనంతరం వాటిలో పసుపు, ఉప్పు, సోపు, మెంతులు, ఆవాలు వంటి మసాలా దినుసులు పొడి చేసి కట్ చేసిన మిర్చిలో స్టఫ్ చేయాలి.

Image Source: pixabay

అనంతరం ఆవాల నూనె కలపాలి. దీనివల్ల ఊరగాయ రుచి మరింత పెరుగుతుంది.

Image Source: pixabay

మసాలా నింపిన తరువాత మిరపకాయలను గాజు సీసాలో పెట్టి ఎండలో ఉంచుతారు.

Image Source: pixabay

సుమారు 3-4 రోజుల్లో ఈ ఊరగాయ బాగా తయారవుతుంది.

Image Source: pixabay