మొదటి జీతం నుంచే పొదుపు, పెట్టుబడి అలవాటు చేసుకోవాలి. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఫండ్ తయారు చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. చిన్న చిన్న నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి.
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఖర్చు చేయడానికి బదులుగా పొదుపు, పెట్టుబడి ప్రారంభించాలి. ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేసుకున్న తర్వాత FD, RD లేదా SIP లలో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి.

- మొదటి జీతం నుంచే ఆర్థిక ప్రయాణం మొదలుపెట్టి, అత్యవసర నిధిని స్థాపించండి.
- ఎఫ్‌డి, ఆర్‌డి, సిప్‌లలో మీ లక్ష్యాలకు తగ్గట్లుగా పెట్టుబడులు చేయండి.
- 50:30:20 నియమం పాటిస్తూ, పెట్టుబడిలో సాధారణ పొరపాట్లను నివారించండి.
ఉద్యోగంలో చేరాక వచ్చే మొదటి సంపాదన అనేది కేవలం శాలరీ మాత్రమే కాదు.. అది మీ ఆర్థిక ప్రయాణానికి అసలైన ప్రారంభం. మీ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపగల చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసింది. చాలామంది మొదటి శాలరీ రాగానే షాపింగ్, తిరగడం లేదా ఇతర ఖర్చులు చేస్తారు.
నిపుణుల ప్రకారం.. మొదటి జీతం నుంచే పొదుపు, పెట్టుబడి అలవాటు చేసుకుంటే, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఫండ్ తయారు చేసుకోవచ్చు. ఏ పెట్టుబడినైనా ప్రారంభించే ముందు ఒక బలమైన ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మీరు మీ అవసరానికి అనుగుణంగా FD, RD లేదా SIP వంటి ఆప్షన్లను ఎంచుకోవాలి
ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండి
జీతం రావడం మొదలయ్యాక పెట్టుబడి పెట్టడానికి ముందు కనీసం 3 నుండి 6 నెలల అత్యవసర ఖర్చులకు సరిపడ నగదు పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఈ డబ్బును ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో ఈజీగా తీసుకోగలిగే చోట ఉంచాలి. సాధారణంగా ఉద్యోగం పోయినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర అవసరాల సమయంలో ఈ డబ్బు మీకు ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది అకస్మాత్తుగా వచ్చే ఖర్చులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ మీకు సహాయపడుతుంది.
FD, RD లేదా SIP.. ఎవరికి ఏది ఉత్తమమైన ఆప్షన్?
FD ప్రయోజనాలు
మీ వద్ద ఒకేసారి పెద్ద మొత్తం ఉండి, ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఫిక్స్డ్ డిపాజిట్ (FD) మీకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
మీ పెట్టుబడిపై నిర్ణీత వడ్డీ లభిస్తుంది.
దీనిపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు.
తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఇది ఉత్తమం.
స్వల్పకాలిక లక్ష్యాలు, ఎమర్జెన్సీ సేవింగ్స్ కోసం సరిపోతుంది.
RD ప్రయోజనాలు తెలుసా..
ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేయాలనుకున్న వారికి రికరింగ్ డిపాజిట్ (RD) చాలా ప్రయోజనకరం.
చిన్న మొత్తంతో మీరు పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది. ఇది చాలా మంచిది.
ఇందులో ఖచ్చితమైన రాబడి లభిస్తుంది.
SIP ప్రయోజనాలు
ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఫండ్ తయారు చేయడమే లక్ష్యం అయితే, SIP మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. SIP ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు.
కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రయోజనం పొందుతారు.
దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వచ్చే అవకాశం.
ఇందులో మీరు చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు.
రిటైర్మెంట్, ఇల్లు కొనడం లేదా పిల్లల చదువు వంటి అవసరాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది.
శాలరీ రాగానే 50: 30: 20 నియమాన్ని పాటించండి
50% ఆదాయం అత్యవసర/ ముఖ్యమైన ఖర్చుల కోసం కేటాయించాలి
30% మొత్తం లైఫ్‌స్టైల్, వ్యక్తిగత అవసరాల కోసం
20% మొత్తం పొదుపు, పెట్టుబడి కోసం
ఒకవేళ మీపై ఖర్చుల బాధ్యతలు తక్కువగా ఉంటే, మీ శాలరీలో 30% నుండి 40% భాగం ఇన్వెస్ట్ చేయడానికి పక్కన పెట్టవచ్చు.
ఇలాంటి పొరపాట్లు చేయవద్దు
- పెట్టుబడి ప్రారంభించడంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దు.
- ఎప్పుడూ మీ పూర్తి శాలరీని ఖర్చు చేయవద్దు
- ఎమర్జెన్సీ ఫండ్‌ను నిర్లక్ష్యం చేయకుండా సిద్ధం చేసుకోవాలి.
- కేవలం ఎక్కువ రాబడి వస్తుందనే ఆశతో పెట్టుబడి ప్రారంభించకూడదు
- స్నేహితులను చూసి లేదా సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేయవద్దు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే పెట్టుబడి పెట్టాలి.
Frequently Asked Questions
మొదటి జీతంతో ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?
పెట్టుబడి పెట్టడానికి ముందు అత్యవసర నిధిని ఎందుకు సిద్ధం చేసుకోవాలి?
3-6 నెలల అత్యవసర ఖర్చులకు సరిపడా నగదు పక్కన పెట్టడం ముఖ్యం. ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.
FD, RD, SIP లలో ఏది ఉత్తమం మరియు దేనికి?
మీ వద్ద పెద్ద మొత్తం ఉంటే FD మంచిది. ప్రతి నెలా పొదుపు చేయాలనుకుంటే RD ప్రయోజనకరం. దీర్ఘకాలంలో పెద్ద ఫండ్ కోసం SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
జీతాన్ని సమర్థవంతంగా ఎలా విభజించుకోవాలి?
50:30:20 నియమాన్ని పాటించండి. 50% అత్యవసర ఖర్చులకు, 30% వ్యక్తిగత అవసరాలకు, 20% పొదుపు, పెట్టుబడి కోసం కేటాయించండి. బాధ్యతలు తక్కువగా ఉంటే 30-40% పెట్టుబడి పెట్టవచ్చు.
ట్రెండింగ్ వార్తలు























