అన్వేషించండి

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

Air India Latest News: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా టేవోల్డే గెబ్రేమరియంను నియమించింది. ఆయనే మేనేజింగ్ డైరెక్టర్ (MD)గానూ బాధ్యతలు చేపట్టనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీగా టెవోల్డే గెబ్రేమరియం నియామకం.
  • ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌ను లాభాల బాట పట్టించిన సుదీర్ఘ అనుభవం.
  • ప్రస్తుతం భారీ నష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా సంస్థ.
  • ఆయన నాయకత్వంలో సంస్థ కొత్త దశ, దిశ పొందుతుందని ఆశలు.

AIR India New CEO MD: దేశంలోని ప్రసిద్ధ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా (Air India) టెవోల్డే గెబ్రేమరియంను కంపెనీ కొత్త సీఈఓ అంటే ముఖ్య కార్యనిర్వాహక అధికారి, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. టెవోల్డే గెబ్రేమరియం అంతకుముందు Ethiopian Airlines Group అధినేతగా సేవలు అందించారు. 

ఉపయోగపడిన ఏవియేషన్ ఇండస్ట్రీ అనుభవం 
టెవోల్డే గెబ్రేమరియం చాలా కాలంగా ఏవియేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. అందువల్ల ఆయన దీర్ఘ అనుభవం Air Indiaకి ఎంతో ఉపయోగపడనుందని భావిస్తున్నారు. ఆయన నియామకంతో Air Indiaలో కూడా కంపెనీ పనితీరు, అభివృద్ధికి కొత్త దశా దిశ లభిస్తుందనే ఆశలు పెరిగాయి. టేవోల్డేకు ఎయిర్‌లైన్ ఆపరేషన్స్, విస్తరణ, మెరుగైన కస్టమర్ సర్వీస్ రంగాల్లో మంచి అనుభవం ఉంది.

Ethiopian Airlinesకు లాభాలు తెచ్చిన అనుభవం
Air India ప్రకారం టెవోల్డే గెబ్రేమరియం గతంలో Ethiopian Airlinesకు అధిపతిగా వ్యవహరించారు. ఆయన పదవీకాలంలో ఎయిర్‌లైన్ వేగంగా విస్తరించడంతో పాటు సంస్థ లాభాలు పెరిగాయి. అలాగే ప్రపంచ స్థాయిలో ఎయిర్ లైన్స్ తన గుర్తింపును ఏర్పరుచుకుంది. అందువల్ల ఇప్పుడు Air India కూడా టేవోల్డే మెరుగైన ఫలితాలు అందిస్తారని భారీగా ఆశలే పెట్టుకుంది. సంస్థ సేవలు వేగంగా విస్తరింపజేస్తారని భావిస్తోంది. 

Air India ఈ సమయంలో తన వ్యాపారాన్ని బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌లైన్ బ్రాండ్లలో చేరే దిశగా పనిచేస్తోంది. అందువల్ల టేవోల్డే గెబ్రేమరియం నియామకాన్ని ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.

ఎవరి స్థానంలో టేవోల్డే బాధ్యతలు తీసుకుంటున్నారు
 Air Indiaలో Campbell Wilson స్థానంలో టెవోల్డే గెబ్రేమరియం బాధ్యతలు చేపట్టనున్నారు. Campbell Wilson జూలై 2022 నుంచి Air Indiaతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2026లో ఆయన రాజీనామా చేయడం తెలిసిందే. Tata Groupకు చెందిన ఈ ఎయిర్‌లైన్ ప్రస్తుతం భారీ నష్టాలను ఎదుర్కొంటోంది.

ముఖ్యంగా 2025లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్‌పై ప్రభుత్వ, నియంత్రణ సంస్థల విచారణలు పెరిగాయి. అదనంగా, Middle Eastలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా కూడా విమానాల ఆపరేషన్లలో పలు ఇబ్బందులు వచ్చాయి. ఈ సమస్యల వల్ల ఎయిర్‌లైన్ ఖర్చులు సైతం పెరిగాయి. మరోవైపు, Pakistan తమ airspaceపై విధించిన ఆంక్షలు కూడా సంస్థ కష్టాలను మరింత పెంచాయి. ఇవి ఎయిరిండియా ఎయిర్‌లైన్ వ్యాపారం, లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. అందువల్ల ఇప్పుడు అందరి దృష్టి కొత్త సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న  టెవోల్డే గెబ్రేమరియంపైనే ఉంది.

 

Frequently Asked Questions

ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీ ఎవరు?

టెవోల్డే గెబ్రేమరియం ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ అధిపతిగా పనిచేశారు.

టెవోల్డే గెబ్రేమరియంకు ఏవియేషన్ రంగంలో ఎలాంటి అనుభవం ఉంది?

ఆయనకు ఏవియేషన్ పరిశ్రమలో దీర్ఘకాల అనుభవం ఉంది. ఎయిర్‌లైన్ ఆపరేషన్స్, విస్తరణ, కస్టమర్ సర్వీస్ రంగాల్లో నిపుణుడు.

టెవోల్డే గతంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు ఎలాంటి ఫలితాలను అందించారు?

టెవోల్డే పదవీకాలంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ వేగంగా విస్తరించింది, లాభాలు పెరిగాయి. ప్రపంచ స్థాయిలో ఎయిర్ లైన్స్ తన గుర్తింపును ఏర్పరుచుకుంది.

టెవోల్డే గెబ్రేమరియం ఎవరి స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు?

ఆయన క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో బాధ్యతలు తీసుకుంటున్నారు. క్యాంప్‌బెల్ విల్సన్ ఏప్రిల్ 2026లో రాజీనామా చేశారు.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి?

ఎయిర్ ఇండియా భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. 2025 విమాన ప్రమాదం తర్వాత విచారణలు, మధ్యప్రాచ్య సంఘర్షణలు, పాకిస్తాన్ గగనతలం ఆంక్షలు వంటి సమస్యలున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget