Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP Desam
డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత స్పేస్ ఎక్స్ సంస్థ సహాయక సిబ్బంది క్యాప్సూల్ ను రెస్క్యూ చేసి ఆస్ట్రోనాట్లను బయటకు తీసుకువచ్చారు. ప్రత్యేకించి తొమ్మిది నెలలుగా ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే తన జీవితాన్ని గడిపిన సునీతా విలియమ్స్ రాక కోసం అంతా వేయి కళ్లతో ఎదురుచూడగా..ఆ ధీర వనిత నవ్వుతూ ధైర్యంగా బయటకు వచ్చారు. సహాయక సిబ్బంది సహాయంతో అతి కష్టం మీద ఓపిక కూడదీసుకుని లేచి భూమిపై కాలు ఆన్చిన సునీతా విలియమ్స్ స్ట్రెచర్ పై కూర్చుని ఆసుపత్రికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ తను సాధించానన్నట్లు నవ్వుతూ తనను అప్రిషియేట్ చేసుకుంటూ విజయ సంకేతం చూపిస్తూ వెళ్లారు. మైక్రో గ్రావిటీ కారణంగా తొమ్మిది నెలల పాటు గాల్లో తేలుతూనే ఉన్న సునీతా విలియమ్స్ సహా మిగిలిన ఆస్ట్రోనాట్ల కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. కొన్నాళ్ల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న తర్వాత మాత్రమే తిరిగి వాళ్లు నడవగలుగుతారు.





















