అన్వేషించండి

Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

Weather in Telugu States: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, పిడుగులు పడ్డాయి.
  • గుంటూరు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు, గోడ కూలి పిల్లవాడు మృతి చెందాడు.
  • రైతుల మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు అకాల వర్షంతో నేలపాలయ్యాయి.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి.

Weather in Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు, ఆకాశం మేఘావృతమైన ఉపశమనం కలిగిస్తుందని అనుకునేలోపే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వణికించాయి. ఈ అకాల వర్షం సామాన్య ప్రజల ప్రాణాలను తీయడమే కాకుండా, చేతికి వచ్చిన పంటను అందకుండా చేసిన రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీసింది. 

గుంటూరు, నంద్యాల జిల్లాలో పెను విషాదం

ప్రకృతి వైపరిత్యం కారణంగా గుంటూరు, నంద్యాల జిల్లాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఈ సాయంత్రం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి భారీ వర్షం కురిసింది. అదే సమయంలో తుళ్లూరులోని మేరిమాత స్కూల్‌ మైదానంలో హఠాత్తుగా పిడుగు పడింది. దురదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావు అే వ్యక్తిపై పిడుగుపడటంతో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. మృతుడు బీఎస్‌ఆర్ కంపెనీలో సర్వేయర్ విభాగ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 

మరోవైపు నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో కరిసిన భారీ వర్షానికి ఒక పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసు ఉన్న అభి అనే పసిబాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అమరావతి ప్రాంతంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 

నేలపాలైన పంటలు

ఈ అకాల వడగళ్ల వాన రైతుల ఆశలను అడియాశలు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వాన మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయు పెద్ద ఎత్తున నేలరాలాయి. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ ప్రకృతి విపత్తు ర్థికంగా పెద్ద దెబ్బ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణలో జోరు వానలు 

తెలంగాణలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా,కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా నేలరాలింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌ మండలం పరిధిలో కురిసిన వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలో మిర్చి రైతులు తమ పంటను కాపాడుకోవడానికి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అకాల వర్షం నుంచి కుప్పలుగా పోసిన మిర్చి తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

విమాన సర్వీసులకు అంతరాయం 

వాతావరణ మార్పుల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో దిగలేకపోయింది. ఏలూరు జిల్లా నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడ ఒక ఇంటిపై పిడుగు పడటంతో ఆ ఇంటి టెర్రస్‌పైన ఉన్న పిట్టగోడ ధ్వంసమైంది. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిన మోస్తరు వర్షం కురిసింది. 

రాబోయే మూడు రోజులు అప్రమత్తం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండబోతోందని ఆయన వెల్లడించారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 

ప్రధానంగా ఈ జిల్లాల్లో ప్రభావం 

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవం, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ , గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 

 

 

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంది?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది.

అకాల వర్షం వల్ల ఎవరికి నష్టం జరిగింది?

ఈ అకాల వర్షం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు తీయడంతో పాటు, రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించింది. చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ముఖ్యంగా మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడెక్కడ విషాదం చోటు చేసుకుంది?

గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మరణించాడు. నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో గోడ కూలి ఏడాది బాలుడు మృతి చెందాడు.

రవాణా వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంది?

వాతావరణ మార్పుల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా విమానాశ్రయాల్లో విమానాలు దిగలేకపోయాయి.

రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

రాబోయే మూడు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget