అన్వేషించండి

Reel Mad: తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్

Father in gunny bag: పండగ పూట ప్రయాణ కష్టాలపై వెరైటీగా వీడియో తీయాలనుకున్న ఒక కుటుంబం ఏకంగా కన్నతండ్రినే పార్శిల్ చేశారు. వీరి తీరి చూసి అంతా నివ్వెర పోయారు.

Children packed their father in a gunny bag For Reel: సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ వింత ఘటనే ఒక నిదర్శనం. పండగ పూట ప్రయాణ కష్టాలపై వెరైటీగా వీడియో తీయాలనుకున్న ఒక కుటుంబం ఏకంగా కన్నతండ్రినే పార్శిల్ చేయబోయి నవ్వుల పాలయింది.

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైకుల కోసం జనం ఎంతటి సాహసానికైనా, వింత చేష్టలకైనా వెనకాడటం లేదు. పండగ సీజన్‌లో బస్సులు, రైళ్లలో టికెట్లు దొరకడం ఎంత కష్టమో చూపిస్తూ ఒక  ఫన్నీ రీల్ చేయాలనుకుంది ఒక కుటుంబం. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని  గోనె సంచి లో కుక్కి, దానిని కొరియర్ ఆఫీస్‌కు తీసుకువెళ్లి బయటి ఊరికి పంపాలని సిబ్బందిని కోరారు. బస్సు టికెట్ల కంటే మనిషిని కొరియర్ చేయడం సులభమని చెప్పడం వారి ఉద్దేశం.

ఈ ఘటన బెంగళూరులోని ఒక ప్రముఖ కొరియర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద గన్ బ్యాగ్‌ను తీసుకువచ్చి, దానిని నగరం వెలుపలికి పంపాలని సిబ్బందిని అడిగారు. అయితే, ఆ సంచిలో ఏదో కదలిక ఉండటాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం వచ్చింది. లోపల ఏముందని ప్రశ్నించగా, వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి సంచిని విప్పి చూడగా, అందులో ఒక వృద్ధుడు  ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఆ వృద్ధుడు ఆ మహిళ తండ్రే.  ప్రాణాలతో ఉన్న వ్యక్తిని అలా సంచిలో కట్టి ఉంచడం చూసి పోలీసులు వారిని నిలదీశారు. విచారణలో అసలు విషయం బయటపడింది. పండగ రద్దీని తట్టుకోలేక తండ్రిని ఇలా కొరియర్ చేస్తున్నట్లుగా ఒక కామెడీ రీల్ చిత్రీకరించడమే తమ ప్లాన్ అని సదరు కూతురు, కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కేవలం ఒక వీడియో కోసం ప్రాణాపాయం ఉంటుందని తెలిసినా వృద్ధుడిని అలా సంచిలో కుక్కడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని, సంచిలో గాలి ఆడక ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని వారిని మందలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.  

 

ఈ లోకంలో టెక్నాలజీని, సోషల్ మీడియాను సృజనాత్మకత కోసం కాకుండా, ఇలాంటి వెర్రి చేష్టల కోసం వాడుతున్న తీరుపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ కోసం కన్నతండ్రిని కూడా వస్తువులా చూడటం దారుణం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sex work legality in India 2026: సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో సెక్స్ వర్క్ చట్టబద్ధమైనట్లు కాదు - చట్టాలు ఏం చెబుతున్నాయంటే ?
సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో సెక్స్ వర్క్ చట్టబద్ధమైనట్లు కాదు - చట్టాలు ఏం చెబుతున్నాయంటే ?
Swami Chinmayanand 550 crore donation: స్వామి చిన్మయానంద్ సంచలనం - రూ. 550 కోట్ల ఆస్తులు యూనివర్సిటీకి దానం - ఈయన చరిత్ర చిన్నదేం కాదు!
స్వామి చిన్మయానంద్ సంచలనం - రూ. 550 కోట్ల ఆస్తులు యూనివర్సిటీకి దానం - ఈయన చరిత్ర చిన్నదేం కాదు!
YS Sharmila Rajya Sabha: ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
Breaking News: సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
Advertisement

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే! 
100 ఏనుగుల బరువు, అయినా కింద పడవు! మేఘాల వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్‌ మీకు తెలుసా? 
Embed widget