Sreeleela : ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
Sreeleela Reaction : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రంగస్థలం మహేష్‌పై హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్ వైరల్ కాగా... దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

Sreeleela Clarity About Serious Look On Rangashtalam Mahesh : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'రంగస్థలం' మహేష్‌పై హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్ ఇవ్వడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రెస్ మీట్‌లో హీరోయిన్ శ్రీలీల దీనిపై రియాక్ట్ అయ్యారు.
అసలేం జరిగిందంటే?
'రంగస్థలం' మహేష్‌ను తాను సీరియస్‌గా చూసినట్లుగా వీడియో వైరలైన సంగతి తనకు తర్వాత తెలిసిందని చెప్పారు శ్రీలీల. 'మాటలు లేనప్పుడు చూసే ఎక్స్‌ప్రెషన్స్‌ను మనం ఏమైనా అనుకుంటాం. ఆ తర్వాత ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు పవన్ స్పీచ్ టైంలో నాకు వెనుక నుంచి ఓ సౌండ్ వినిపించింది. అలా వెనక్కి తిరిగా. ఆయన వద్ద నా ఫోన్ ఉంది. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు మహేష్ నాకు హెల్ప్ చేశారు. నేను ఫోన్ కోసమే తిరిగానేమో అనుకుని ఆయన చూసి నవ్వారు.
ఏదో వినిపించిందని నేను తిరిగి చూశాను. అందరం పవన్ స్పీచ్‌పైనే ఫోకస్ చేశాం. నార్మల్‌గా చూసిందే అలా వైరల్ అయ్యింది. అక్కడ అలా ఏమీ జరగలేదు. ఇండస్ట్రీ అనేటప్పుడు అనుకోని ఇలాంటి క్లిప్పింగ్స్ వైరల్ అవుతుంటాయి. ఇది కేవలం మిస్ కమ్యూనికేషనే. నేను సినిమాలో ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను. ఏదైనా ఎవరైనా స్వయంగా చెబితే తప్ప నమ్మొద్దు. ఆ వీడియో చూసిన వెంటనే నాకే బాధ అనిపించింది. మిస్ బిహేవ్, సీరియస్ లుక్ అనేవి బిగ్ వర్డ్స్. నాకు ఎవరిపైనా కోపం లేదు.' అని క్లారిటీ ఇచ్చారు.
అలా ఏమి లేదు.. ఆరోజు ఏం జరిగిందంటే?#Sreeleela about her Viral Clip with #MaheshAchanta ! pic.twitter.com/tk8817WJtG
— Rajesh Manne (@rajeshmanne1) March 18, 2026
Also Read : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ డీల్ - సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అసలేం జరిగిందంటే?
ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ స్పీచ్ అవుతుండగా హీరోయిన్ శ్రీలీల రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్ ఇచ్చారు. ఒక్కసారిగా వెనక్కు తిరగ్గా ఆయన నవ్వారు. ఆ తర్వాత ఆమె ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండానే సీరియస్‌గా ఇటు వైపు తిరిగారు. ఈ వీడియో వైరల్ కాగా మహేష్ ఏం చేశాడంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై మహేష్ కూడా వెంటనే క్లారిటీ ఇచ్చారు.
'శ్రీలీల ఫోన్ పట్టుకోమని తనకు ఇచ్చారని... ఆ తర్వాత వెనక్కు తిరిగి నా వైపు చూస్తే ఫోన్ కోసమే చూస్తున్నారని అనుకున్నా. ఈలోపు ఆవిడ పైకి స్క్రీన్ వైపు చూశారు. అంతే జరిగింది. ఇక్కడ ఎవరినీ అగౌరవపరచొద్దు.' అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చారు. తాజాగా శ్రీలీల సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా... గబ్బర్ సింగ్‌ను మించి రెస్పాన్స్ అదిరిపోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























