అన్వేషించండి

Top Petrol Scooters in India : ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!

Top Petrol Scooters in India : భారత్ మార్కెట్‌లో పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే సుమారు 14 నుంచి 16 ప్రధాన మోడళ్లు, 40కిపైగా భిన్న వెరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 నాటికి 14-16 పెట్రోల్ స్కూటర్ మోడళ్లు అందుబాటులో ఉంటాయి.
  • ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్ల ధరలు 44 వేల నుంచి లక్షా నలభై వేల వరకు ఉన్నాయి.
  • హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మంచి మైలేజీని అందిస్తున్నాయి.
  • యువత కోసం టీవీఎస్ ఎన్ టార్క్, హోండా డియో స్పోర్టీ లుక్ కలిగి ఉన్నాయి.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. అయినప్పటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజలు మొదటి ప్రాధాన్యత  మాత్రం పెట్రోల్ స్కూటర్లే. 2026 మార్చి నాటికి భారత్ మార్కెట్‌లో పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే సుమారు 14 నుంచి 16 ప్రధాన మోడళ్లు, 40కిపైగా భిన్న వెరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. హోండా, టీవీఎస్‌, సుజుకి, యమహా, హీరో వంటి దిగ్గజ కంపెనీలు సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 

ధరలు- వేరియంట్లు...

ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్ స్కూటర్ల ధరలు ఎక్స్ షోరూమ్‌ ప్రాతిపదికన 44 వేల నుంచి ప్రారంభమై లక్షా నలభై వేల వరకు పలుకుతున్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లా ఆన్‌రోడ్డ ధరలు ఆర్టీవో, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చులతో కలిపి మరో 10 నుంచి 15 శాతం అదనంగా ఉంటాయి. ఈ ఆధునిక స్కూటర్లన్నీ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్నాయి. దీని వల్ల నగర ట్రాఫిక్‌లో ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. 

నమ్మకానికి మారుపేరుగా హోండా స్టైల్‌

భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే స్కూటర్ ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా హోండా యాక్టివా మాత్రమే. భారీగా అమ్ముడవుతూ, అత్యధిక రీసేల్ వాల్యూ కలిగిన వాహనంగా రికార్డు సృష్టించింది. 

హోండా యాక్టివా 6జీ: 

ఇది 75,433 నుంచి 89,806 ధరల మధ్య లభిస్తోంది. ఇది లీటర్‌కు 50-59 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోంది. ఇందులో ఉన్న సైలెంట్‌ స్టార్ట్‌ టెక్నాలజీ, ఎల్‌ఈడీ లైట్లు, 22-26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఎస్టీడీ డీఎల్ఎక్స్‌, హెచ్‌స్మార్ట్‌ వంటి వేరియెంట్లు ఉన్నాయి. 

హోండా డియో: 

యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ స్కూటర్ స్పోర్టీ లుక్‌తో ఉంటుంది. కేవలం 105 కిలోల బరువు ఉండటం వల్ల దీనిని హ్యాండిల్ చేయడం సలభం. 

టెక్నాలజీలో మేటి టీవీఎస్‌- సుజుకి

ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో టీవీఎస్‌, సుజుకి సంస్థలు ముందు వరసులో ఉన్నాయి. 

టీవీస్‌ జూపిటల్‌: 

కుటుంబ సభ్యులందరికీ సరిపోయే విధంగా రూపొందించిన ఈ స్కూటర్‌ 33 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంది. స్మార్ట్ కనెక్ట్‌, బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా నావిగేషన్, కాల్స్ అలర్ట్‌ పొందవచ్చు. దీని ధర 73,400 నుంచి 87,800 వరకు ఉంది. 

టీవీఎస్‌ ఎన్ టార్క్‌: 

స్పీడ్, పర్ఫార్మెన్స్‌ కోరుకునే యువతకు ఇది ఫేవరెట్‌. ఇందులో టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఏబీఎస్‌ ఆప్షన్ కూడా ఉంది. 

సుజుకి యాక్సెస్‌ 125: 

స్మూత్‌ రైడింగ్ అనుభూతికి ఇది పెట్టింది పేరు. బ్లూటూత్‌‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్: 

ప్రీమియం బాడీ లుక్‌, ఎక్కువ లెగ్ స్పేస్‌ దీని ప్రత్యేకత 

మైలేజీ రారాజులు యమహా- హీరో

పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ మైలేజీపై దృష్టి పెట్టే వారి కోసం కొన్ని అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

యమహా రేజెడ్‌ఆర్‌/ ఫాసినో 125: 

యమహా తన హైబ్రీడ్‌ అసిస్ట్‌ టెక్నాలజీతో సంచలనం సృష్టిస్తోంది. ఈ స్కూటర్లు లీటరుకు 49 నుంచి 71 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తాయి. హైబ్రీడ్‌ టెక్నాలజీ వల్ల ఇంజిన్ శక్తి సామర్థ్యం పెరుగుతుంది. 

హీరో డెస్టినీ: 

బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే లీటరుకు 56-60 కిలోమీటర్లు మైలేజీని అందిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌. 

టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ 100: 

అతి తక్కువ ధరలో లభించే ఈ వాహనం గ్రామీణ ప్రాంతాల్లో, డెలివరీ పనులకు బాగా ఉపయోగపడుతుంది. ఇది 65 కిలోమీటర్లు మైలేజీని క్లెయిమ్ చేస్తోంది. 

ఎవరికి ఏ స్కూటర్ బెటర్ 

ప్రతి వినియోగదారుడికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం మీరు నమ్మకమైన, తక్కువ మెయింటెనెన్స్‌, మంచి రీసేల్ వాల్యూ ఉన్న వాహనం కావాలనుకుంటే హోండా యాక్టివా 6జీ లేదా 125 ఉత్తమమైంది. 

బరువు తక్కువగా ఉండి, సులభంగా నడపగలిగే టీవీఎస్‌ జూపిటర్, యమహా రేజెడ్‌ఆర్ లేదా ఫాసినో స్కూటర్లు మహిళలకు సౌకర్యవంతంగా ఉంటాయి. వీటి సీట్ హైట్‌ తక్కువగా ఉంటడం వల్ల రైడింగ్ సులభం అవుతుంది. 

స్పోర్టీ లుక్, హైపవర్‌ కోసం టీవీఎస్ ఎన్టార్క్ లేదా హోండా డియోను ఎంచుకోవచ్చు.  

ఎక్కువ లెగ్ రూమ్‌, బిగ్ బాడీ, హుందాతనం కోరుకునే వారికి సుజుకీ బర్గ్‌మన్‌ లేదా యమహా ఏరోక్స్‌ 155 సరైన ఆప్షన్‌గా చెబుతారు. రెట్రో లుక్ ఇష్టపడే వాళ్లు వెస్పాను ఎంచుకోవచ్చు. 

ఇంజిన్, భద్రతలో పోటాపోటీ 

ప్రస్తుతం మార్కెట్‌లో 110 సీసీ, 125-150 సీసీ ఇంజిన్లు మధ్య ప్రధాన పోటీ ఉంది. 110 సీసీ స్కూటర్లు తక్కువ బరువు ఉండి 50కిపైగా మైలేజీని ఇస్తున్నాయి. అదే 125 సీసీ , అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగి వాహనాలు ఎక్కువ పవర్ అందిస్తాయి. కానీ మైలేజీ కొంచెం తక్కువగా ఉంటుంది. భద్రత విషయానికి వస్తే, దాదాపు అన్ని స్కూటర్లు సీబీఎస్‌ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. కొన్ని టాప్ వేరియంట్లు ఏబీఎస్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉన్నాయి. 

Frequently Asked Questions

భారత మార్కెట్లో ప్రస్తుతం ఎన్ని పెట్రోల్ స్కూటర్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి?

2026 మార్చి నాటికి, భారత మార్కెట్లో సుమారు 14 నుంచి 16 ప్రధాన పెట్రోల్ స్కూటర్ మోడళ్లు, 40కి పైగా వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

పెట్రోల్ స్కూటర్ల ఆన్-రోడ్ ధరలు ఎలా ఉంటాయి?

పెట్రోల్ స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలు 44,000 నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఆర్టీవో, ఇన్సూరెన్స్ ఖర్చులతో కలిపి ఆన్-రోడ్ ధరలు 10-15% ఎక్కువగా ఉంటాయి.

కుటుంబ అవసరాలకు ఏ స్కూటర్ ఉత్తమమైనది?

కుటుంబ అవసరాలకు, నమ్మకమైన, తక్కువ నిర్వహణ, మంచి రీసేల్ విలువ కలిగిన హోండా యాక్టివా 6G లేదా 125 ఉత్తమ ఎంపిక.

మైలేజ్ విషయంలో ఏ స్కూటర్లు ముందున్నాయి?

మైలేజ్ విషయంలో యమహా రేజెడ్‌ఆర్‌/ఫాసినో 125 (49-71 కిమీ/లీ) మరియు హీరో డెస్టినీ (56-60 కిమీ/లీ) మంచి ఎంపికలు.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget