మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన చేస్తున్న కృషికి యూకే పార్లమెంటు ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. లండన్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.