అన్వేషించండి
Holi Special: హోలీ రోజు ఇలా చేస్తే కీడు పోతుంది.. 'కాంతారా'ను మించి అనిపించే ఇలాంటి పండుగ మీరెక్కడా చూసి ఉండరు!
Adilabad Tribal Holi festival celebrations 2025: ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా ప్రకృతిని పూజిస్తారు. హోలీ పండుగ సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాస్తవానికి ఇదే అసలైన హోలీ...
Holi 2025
1/9

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడి గూడలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు..హోలీ సందర్భంగా కామదహన వేడుకలు నిర్వహించారు. దీన్నే దురాడి అని పిలుస్తారు.
2/9

ఫాల్గుణమాస పౌర్ణమి రోజు గూడెంల ఉన్నవారంతా గ్రామ పటేల్ ఇంటికెళ్లి కుడకలు తీసుకొచ్చి ఇస్తారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలున్నాయో ఈ కుడకలు చెప్పేస్తాయి
3/9

గొంగడిలో కుడకలు ఉల్లిగడ్డలు వంకాయలు గారెలు పెట్టి వాటిని జనపనార తాడుతో నాలుగు వైపులా వెదురుకర్రలు జతచేసి కట్టేస్తారు. దీన్ని పుల్లారా అనీ అంటారు ఆదివాసీలు
4/9

గొంగడిలో కట్టేసిన తర్వాత డోలు వాయిస్తూ అందరూ ఓచోటుకి చేరుతారు. పటేల్ ఇంటి నుంచి నైవేద్యం తీసుకొచ్చి గ్రామ శివారుకు వెళ్లి పూజ చేస్తారు. అక్కడ రెండు గుంతలు తవ్వి అందులో రెండు గుడ్లు వేస్తారు. అక్కడే కర్రలు నిలబెడతారు
5/9

వెదురుకర్రలకు పుల్లారాను కట్టి..అనంతరం గడ్డి, కర్రలు వేసి కామదహన వేడుకలు నిర్వహిస్తారు. మంట మండుతుండగా రెండుసార్లు అట్నుంటి ఇటు ఇట్నుంచి అటు మంటల్లోకి దూకుతారు. ఇలా చేస్తే కీడు పోతుందని నమ్మకం
6/9

వెదురుకర్రలు కాలిపోయిన తర్వాత కిందపడుతుండగా వాటికి ఉన్న పుల్లారాను కిందపడకుండా పట్టుకుంటారు. అది భూమ్మీద పడకూడదు అనేది వారి సెంటిమెంట్. ఆ తర్వాత నైవేద్యాలు సమర్పించి ప్రసాదం పంచిపెడతారు
7/9

ఒకప్పుడు సహజసిద్ధమైన రంగుల తయారీకి మోదుగ పూలను ఉపయోగించేవారు..ఆదివాసీలు ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు
8/9

కామదహనం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
9/9

పూజ, నైవేద్యం, ప్రసాదాలు అయ్యాక.. గ్రామ పటేల్ తయారు చేసిన వంటకాలను అందరూ కలసి సహపంక్తి భోజనాలు చేస్తారు. రాత్రంతా అక్కడే ఉండి ఉదయం వరకూ జాగరణ చేస్తారు
Published at : 14 Mar 2025 10:57 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఆరోగ్యం
బిజినెస్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















