అన్వేషించండి

Ugadi Panchangam in Telugu (2024-2025) : మీ నక్షత్రం , రాశి ఏంటో తెలియదా - మీ పేరు ఆధారంగా ఇలా తెలుసుకోండి!

మీ నక్షత్రం, రాశి ఏంటో మీకు తెలుసా? కొందరికి రాశి తెలుస్తుంది నక్షత్రం తెలియదు..మరికొందరికి నక్షత్రం తెలుస్తుంది కానీ ఏ రాశి అన్నది కొంత డైలమా. ఇలాంటి సందేహాలున్నవారికే ఈ వివరాలు...

Ugadi Panchangam in Telugu  2024-2025: జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు. ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడుగుతుంటారు. ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయించేనారు కొందరు... మరికొందరు నక్షత్రం గుర్తుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. అందుకే నక్షత్రం ఏంటి అనేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. నక్షత్రం, రాశి తెలిసినవారి సంగతి సరే కానీ...ఈ రెండు తెలియని వారు తమ పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఎలా తెలుసుకోవచ్చో ఇక్కడ వివరంగా ఉంది..

  • మొత్తం 27 నక్షత్రాలు (అశ్విని నుంచి రేవతి)
  • 12 రాశులు ( మేష రాశి  నుంచి మీన రాశి)
  • ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి
  • ఒక్కో రాశిలో 9 పాదాలుంటాయి...

ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయని చెప్పుకున్నాం కదా. ఓ నక్షత్రం కాస్త అటు ఇటుగా 24 గంటలు ఉంటుంది. 24 ని నాలుగు భాగాలు చేస్తే 6 గంటలు. అంటే నక్షత్రంలో మొదటి 6 గంటలు మొదటి పాదం, తర్వాతి 6 గంటలు రెండో పాదం, మూడో ఆరోగంటలు మూడోపాదం..ఆఖరి 6 గంటలు నాలుగోపాదం. నక్షత్రంలో మీ పాదాన్ని బట్టి మీ రాశి మారుతుందని గమనించగలరు.

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

నక్షత్రం తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా తెలుసుకోవచ్చు....

నక్షత్రం     పేరులో మొదటి అక్షరం

అశ్వని:    చూ/చే/చో/ లా
భరణి:     లీ/లూ/లే/లో
కృత్తిక:     ఆ/ఈ/ఊ/ ఏ
రోహిణి:     ఈ/వా/వీ/వూ
మృగశిర:  వే/వో/కా/కీ,
ఆరుద్ర:    కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు:  కే/కో/ హ/ హీ/
పుష్యమి:     హు/హే/హో/డా
ఆశ్లేష:        డీ/డూ/డే/డో
మఖ:        మా/ మి/ మూ/మే
పూర్వ ఫల్గుణి: మో /టా/ టీ/ టూ
ఉత్తర ఫల్గుణి:  టే/టో/ పా /పీ
హస్త:       వూ/షం /ణా/ ఢా
చిత్త:       పే/పో/రా/రి
స్వాతి:    రూ/ రే/ రో /లా
విశాఖ:    తీ/తూ/తే /తో
అనూరాధ:  నా /నీ /నూ /నే
జ్యేష్ట:     నో /యా /యీ/యూ
మూల:   యే /యో /బా/ బీ
పూర్వాషాడ:  బూ/ ధా /భా /ఢా
ఉత్తరాషాడ:  బే/బో / జా / జీ
శ్రవణం:   జూ/జే /జో/ ఖా
ధనిష్ట:   గా/ గీ/ గూ/గే
శతభిషం:   గో /సా/ సీ /సూ
పూర్వాభద్ర:  సే /సో/ దా/దీ
ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
రేవతి:   దే/దో/చా/చీ

Also Read: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!

ఏ రాశిలో ఏ ఏ నక్షత్రాలుంటాయి...

మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం

వృషభ రాశి
కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు

మిథున రాశి
మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

కర్కాటక రాశి
 పునర్వసు నాలుగో పాదం, పుష్యమి, ఆశ్లేష

సింహ రాశి
మఘ, పుబ్బ(పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం

కన్యా రాశి
ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు 

తులా రాశి
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు 

వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 

ధనస్సు రాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

మకర రాశి
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు

కుంభ రాశి
ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు 

మీన రాశి
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget