Weekly Horoscope March 10 to 16: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!
Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ వారం రాశిఫలితాలు ఇక్కడ తెలుసుకోండి....
Weekly Horoscope March 10th to march 16th : ఈ వారం మీ రాశిఫలితం...
మేష రాశి
మేష రాశివారు ఈ వారం చాలా ఓపికగా ఉండాలి. అనుకున్న పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. పనిపట్ల శ్రద్ధ, అంకితభావం ఉన్నప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి, నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. వాహన యోగం ఉంది.
వృషభ రాశి
ఈ వారం మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభ పలితాలున్నాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు హానిచేయాలి అనుకున్నవారిపై మీరే పైచేయి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
మిథున రాశి
మిథునరాశివారు ఈ వారం తమ బంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైనా ప్రత్యేక ప్రణాళికను సమయానికి పూర్తిచేయాల్సి వస్తుంది. అదృష్టాన్ని కన్నా కష్టాన్ని నమ్ముకోవాలి. ఒత్తిడి కలిగించే సంఘటనలున్నాయి..చెడుగా ఆలోచించవద్దు. నూతన పరిచయాలు మీకు కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ అవసరం.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ వారం గ్రహబలం అంత అనుకూలంగా లేదుకానీ మీ మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో అశ్రద్ధ వహించవద్దు. అందరిలో కలిసేందుకు, అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాలి. మీ లక్ష్యాలదిశగా అడుగులు ముందుకువేయండి. కుటుంబానికి సమయం కేటాయించండి.
సింహ రాశి
సింహ రాశివారు ఈ వారం కష్టపడితేనే ఫలితాలు పొందుతారు. పనిపట్ల మీకున్న అంకితభావం ప్రదర్శించాల్సిన సమయం ఇది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు..బాగా ఆలోచించిన తర్వాతే ఓ అభిప్రాయానికి రండి. మీకు హాని చేసేవారున్నారు..వివాదాలకు దూరంగా ఉండాలి.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
కన్యా రాశి
ఈ వారం కన్యారాశివారు వారున్న రంగాల్లో ఆశించిన ఫలితం పొందుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుని అడుగుముందుకు వేసిన తర్వాత అడ్డంకులు ఎదురైనా తగ్గొద్దు. చంచలత్వం పనికిరాదు. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. ఈ వారం మీరు వ్యక్తిగత సంబంధాలపై దృష్టి సారించాలి. సమయానికున్న విలువ తెలుసుకోవాలి.
తులా రాశి
ఈ వారం తులా రాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయించండి. వ్యాపార వృద్ధికి ఇదే మంచి సమయం. నూతన పెట్టుబడులు, నూతన భాగస్వాములు కలిసొస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం బావుంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు..
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
వృశ్చిక రాశి
వృశ్చికరాశివారు బద్ధకాన్ని వీడాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి కానీ మధ్యలో ఆపేయవద్దు. వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండాలి. నిరుత్సాహం వద్దు...కుటుంబ సభ్యుల నుంచి సహకారంతో మనోధైర్యం పెరుగుతుంది. మీ బంధాలపట్ల మీకు అవగాహన ఏర్పడుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించండి మరియు జాగ్రత్తగా ఉండండి
ధనస్సు రాశి
ధనస్సు రాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ వారం అనుకూలం. ఏపని చేసినా విజయం అందుకుంటారు. జీవిత ఆశయాలు నెరవేరుతాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొంతకాలంగా వెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
మకర రాశి
ఈ వారం మకరరాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారంలో
ధనయోగముంది. ఆర్థిక లాభాలుంటాయి. స్నేహితుల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారు. డబ్బు ఆదాచేయడంపై దృష్టి సారించాలి. నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం. పరిశోధనలకు కలిసొచ్చే సమయం.
Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!
కుంభ రాశి
ఈ వారం కుంభరాశివారి ప్రేమ సంబంధాలకు శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో శుభసమయం. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు సంతృప్తినిస్తాయి. శత్రుభయం తొలగిపోతుంది.
మీన రాశి
మీన రాశివారు ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ పూర్తిచేస్తారు. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండాలి. గ్రహాలు అనుకూలం లేకపోయినా మీ మానసిక స్థైర్యంతో ముందడుగు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ప్రవర్తనా విధానమే మీకు మంచి చేస్తుంది. మీకోసం మీరు ఆలోచించాలి...
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం