అన్వేషించండి

Holi Date 2024: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!

Holi 2024: హోళీ ఎప్పుడొచ్చింది...మార్చి 24 or 25?...హోళీ అంటే ఏంటీ? హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు? పురాణాల్లో ఈ పండుగ గురించి ఏముంది?

Holi Date 2024

హోళీ ఎప్పుడొచ్చింది?

  • మార్చి 23 చతుర్థశి - కామదహనం
  • మార్చి 24 ఆదివారం ఉదయం 9 గంటల 30 నిముషాల వరకూ చతుర్థశి ఉంది ఆ తర్వాత పౌర్ణమి మొదలైంది. అంటే మార్చి 24 ఆదివారం రాత్రికి పౌర్ణమి ఘడియలున్నాయి..అందుకే మార్చి 24 ఆదివారం హళిగా పూర్ణిమ
  • మార్చి 25 సోమవారం ఉదయం 11 గంటల 30 నిముషాల వరకే పౌర్ణమి ఉంది..అంటే రాత్రికి పౌర్ణమి ఘడియలు లేవు...అన్ని తిథులు సూర్యోదయానికి ఉండడం ప్రధానం  అయితే పౌర్ణమి, అమావాస్య ఘడియలు మాత్రం రాత్రికి ఉండడమే ముఖ్యం...అందుకే హోలీ మార్చి 24నే కానీ మార్చి 25 ఉదయం కూడా హోళీ జరుపుకోవచ్చు...

సత్యయుగం నుంచి హోళీ

దివాలీ తర్వాత దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకునే పండుగ 'హోళీ. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయ్. తొలియుగం అయిన సత్యయుగంలో హోళీ గురించి ఏం చెప్పారంటే 'హోలీ' అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం.   ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రచారంలో చాలా కథలున్నాయి...

Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!

హోళిక  దహనమైన రోజు

హిరణ్యకశపుడి కుమారుడైన ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహా విష్ణువు  ధ్యానంలో ఉంటాడు. అది భరించలేకపోయిన హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకుని సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు మంటల్లోంచి బయటపడగా...హోళిక మాడి మసైపోతుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు. 

Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!

పెళ్లైన వాళ్లు హోళికా దహనం చూడరాదు

హోలికా దహనం చూడడం మంచిదని భావిస్తారు. అయితే  కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం చూడకూడదంటారు. ఎందుకంటే హోళికా దహనం అంటే రీరం అగ్నిలో కాలుతుంది కదా..ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే శవదహనం కదా..అందుకే కొత్తగా పెళ్లైన వాళ్లు చూస్తే వారి జీవితంలో బాధలు వెంటాడతాయంటారు. 

రాత్రివేళ రాక్షసికి పూజలు

కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి ‘హోళిక’ అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి.. ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి ‘హోలీ’ పూజలు నిర్వహిస్తున్నట్లు చెబుతారు.

Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!

హోళీ రోజు కామదహనం 

ఫాల్గుణ పౌర్ణమి రోజు కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకుంటారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగిస్తాడు. అప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల  హోలీ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

డోలోత్సవం

శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.

డోలిక అంటే

డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి ‘డోలికోత్సవం’ జరుపుతారు.  

Also Read: ఈ రాశివారి జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి, మార్చి 10 రాశిఫలాలు

శాస్త్రీయ కారణం ఇదే

వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడిగా మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు..వీటివల్ల మంచి జరగకపోగా ఆరోగ్యానికి హానికరం  

చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాదు నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. 

గమనిక:  కొన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Sa 3rd T20I: రఫ్ఫాడించిన భారత బౌలర్లు, తక్కువ స్కోరుకే సఫారీలు ఆలౌట్.. సగం ఓవర్లు చాలు!
రఫ్ఫాడించిన భారత బౌలర్లు, తక్కువ స్కోరుకే సఫారీలు ఆలౌట్.. సగం ఓవర్లు చాలు!
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Sa 3rd T20I: రఫ్ఫాడించిన భారత బౌలర్లు, తక్కువ స్కోరుకే సఫారీలు ఆలౌట్.. సగం ఓవర్లు చాలు!
రఫ్ఫాడించిన భారత బౌలర్లు, తక్కువ స్కోరుకే సఫారీలు ఆలౌట్.. సగం ఓవర్లు చాలు!
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Embed widget