Horoscope Today 10th March 2024: ఈ రాశివారి జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి, మార్చి 10 రాశిఫలాలు
Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
10 March 2024 Horoscope Today
మేష రాశి
ఈ రోజు మీకు ఉద్యోగ, వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలో అదనపు బాధ్యతలను పొందుతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. ఈరోజు వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
వృషభ రాశి
మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. చేపట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వైవాహిక బంధంలో ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ దినచర్యకు విరామం ఇవ్వండి.
మిథున రాశి
సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మాటలో సౌమ్యత ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. నూతన ఆదాయమార్గాలు ఏర్పడతాయి.
Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!
కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడొద్దు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వస్తుసౌఖ్యాలు, సంపద పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు..కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి
పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త మార్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. కార్యాలయంలో ఉద్యోగులకు సవాళ్లు పెరుగుతాయి. ఇది కెరీర్ వృద్ధికి సహకరిస్తుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
కన్యా రాశి
కార్యాలయ నిర్వహణలో మీ సానుకూల ఇమేజ్‌ని కొనసాగించడానికి ప్రయత్నించండి. వైఫల్యం ఉన్నప్పటికీ వెనకడుగు వేయవద్దు. కార్యాలయంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తారు. సహోద్యోగుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోయి కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం..
Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
తులా రాశి
ఈ రాశివారి జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి. సవాళ్లకు భయపడవద్దు. ఓపిక పట్టండి మరియు ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. కష్టపడి పనిచేయండి ఫలితం నెమ్మదిగా పొందుతారు. అధిక ఒత్తిడి తీసుకోవద్దు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారు పనిలో సంతోషకరమైన ఫలితాలు పొందుతారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అన్ని పనులను సానుకూల దృక్పథంతో నిర్వహించండి. సంబంధాలలో అపార్థాలు పెరగనివ్వవద్దు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి.. సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సోమరితనానికి దూరంగా ఉండండి. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రయత్నాలు చేయండి. గత తప్పిదాల నుంచి నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగండి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు.
మకర రాశి
కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. మీరు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయాన్ని వెచ్చించండి. కార్యాలయ పనిలో బాధ్యతను మరిచిపోవద్దు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. కావున ఆర్థికపరమైన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి.
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!
కుంభ రాశి
కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆఫీసు పనిలో అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రోజూ యోగా, ధ్యానం చేయండి.
మీన రాశి
వృత్తి జీవితంలో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలతో చేసే పనులు సఫలీకృతమవుతాయి. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి. నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోండి. ఇది కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తుంది. కార్యాలయంలో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఈ రోజు వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం