Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ నెగ్గడం భారత జట్టుకు కలిసిరానుంది. అజేయ రికార్డును నిలబెట్టుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.

భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. టాస్ నెగ్గిన భారత కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో, భారత్ ఆధిపత్యం చెలాయించడానికి ఆసక్తిగా ఉంది. టాప్ ఆర్డర్ బలమైన పునాది వేయాలని, బౌలర్లు కివీస్ బ్యాటింగ్ యూనిట్‌పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ వేదికపై భారత్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. ఆడిన 7 వన్డేల్లోనూ విజయం సాధించడం కలిసొచ్చే అంశం. భారత జట్టులో ఒక మార్పు చేశారు. పేసర్ ప్రసిధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
టాస్ నెగ్గిన భారత కెప్టెన్ ఏం చెప్పాడంటే..
శుభ్‌మన్ గిల్ టాస్ అనంతరం మాట్లాడుతూ.. మేం ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. మేం దీని గురించే మాట్లాడుకున్నాం. ఇది మాకు సవాలు, న్యూజిలాండ్ మమ్మల్ని కొంచెం ఒత్తిడిలోకి నెడుతోంది., ఇలాంటి క్షణాల కోసమే ఆటగాళ్లందరూ ఎదురుచూస్తారు. భారీ స్కోరు నమోదవుతుంది కనుక మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ పెద్దగా మంచు కురుస్తుందని నేను అనుకోవడం లేదు, కానీ పిచ్ చాలా బాగున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి ముందుగా ఒక స్కోరును నిర్దేశించడం, ఆపై దాన్ని ఛేదించడానికి ప్రయత్నించడం ఎప్పుడూ మంచిదే. మధ్య ఓవర్లలో, మేము మా లైన్ అండ్త్ లెంగ్త్ లో మరికొంత వైవిధ్యం చూపాలి. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోతే, ఏ లక్ష్యాన్నైనా నిలువరించడం చాలా కష్టం.
జట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్
భారతదేశం (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
గిల్‌కు, విజయం సాధిస్తే 50 ఓవర్ల కెప్టెన్‌గా అతని తొలి సిరీస్ విజయం అవుతుంది. IND vs NZ 3వ వన్డే ప్రత్యక్ష ప్రసారం, టీవీ ప్రసార వివరాలను చూద్దాం.
IND vs NZ 3వ వన్డే ప్రత్యక్ష ప్రసారం: ఎలా చూడాలి
మొదటి రెండు మ్యాచ్‌లలో వలె, IND vs NZ 3వ వన్డే మ్యాచ్ జియోహోట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో పూర్తి మ్యాచ్‌ని చూడటానికి సబ్‌స్కైబర్స్ సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
IND vs NZ 3వ వన్డే: టీవీ ప్రసార వివరాలు
కొన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌లు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తాయి.
ఈరోజు మ్యాచ్ జరిగే వేదికలో అద్భుతమైన వన్డే రికార్డు ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ బలమైన జట్టుగా ఉంది. రెండవ వన్డేలో వారి ఛేజింగ్, అత్యుత్తమ ప్రత్యర్థులపై వారి ఆటతీరును సూచిస్తుంది. కనుక మెన్ ఇన్ బ్లూ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే వన్డేతో పాటు సిరీస్ సొంతం అవుతుంది.




















