వధూవరులకు బాసికం ఎందుకు కడతారు! హిందూ వివాహ పద్దతిలో జరిపే ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయమైన దృక్పథాలున్నాయి పెళ్లిలో వధువరులకు నుదుటన బాసికం కడతారు..ఎందుకో తెలుసా మనిషి శరీరంలో 72వేల నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి ఈ 14 నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు మరీ ముఖ్యమైనవి వీటిలో సుషుమ్న అనే నాడికి కుడి వైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటాయి ఈ రెండు నాడులూ కలిసేది ముఖంలోని నుదుటి మధ్య భాగం ఈ రెండు నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో వుంటుంది. దీనిని దివ్యచక్షవు అని రుషులు అంటుంటారు ఈ దివ్యచక్షువుపై ఇతరుల దృష్టి పడి దోషం కలుగకుండా ఉండేందుకు వధువరుల నుదుట బాసికం కడతారు బాసికం అర్ధచంద్రాకారంలో కానీ, త్రిభుజాకారంలో కాని ఉంటుంది all Images Credit: Pinterest