అన్వేషించండి

KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?

KCR: కృష్ణా జలాలపై నిలదీయడానికి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా? వెళ్లకపోతే రేవంత్ చేసే ఎదురుదాడిని బీఆర్ఎస్ తట్టుకోగలదా?

Will KCR go to the Assembly: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి  నీళ్లు-నిజాలు  నిప్పు రాజేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్ విరామం తర్వాత నేరుగా కృష్ణా జలాల అంశాన్ని  అందుకోవడంతో  దానికి దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అసెంబ్లీ అస్త్రం  సంధించారు.  జనవరి 2 నుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, దమ్ముంటే అక్కడికి వచ్చి ముఖాముఖి చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.  కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. 
 
రేవంత్ వ్యూహం: ఇరుకున పెట్టేందుకేనా? 

సాధారణంగా ఏదైనా కీలక అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తాయి. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయ్యింది. కేసీఆర్ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం  అసెంబ్లీకి రా.. చర్చించుకుందాం అంటున్నారు. ఇది కేసీఆర్‌ను ఇరుకున పెట్టే వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే,  ఆరోపణలు చేయడానికి తప్ప, ఆధారాలతో చర్చించడానికి ఆయన సిద్ధంగా లేరు  అని ప్రజల్లోకి తీసుకెళ్లడం రేవంత్ ప్లాన్.

అసెంబ్లీలో జరిగే చర్చలకే విలువ ఎక్కువ 
  
తెలంగాణ ఉద్యమ మూలాల్లో  నీళ్లు అత్యంత ప్రధానమైనవి. అందుకే కేసీఆర్ మళ్లీ అదే సెంటిమెంట్‌ను రగిలించాలని చూస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి దీనికి బలమైన కౌంటర్ ఇస్తున్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తెలంగాణకు మరణ శాసనం అని ఆయన ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 811 టీఎంసీల్లో కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకుని ద్రోహం చేశారని రేవంత్ అంటున్నారు. జూరాల వద్ద ఉండాల్సిన ఇన్ టేక్ పాయింట్‌ను శ్రీశైలంకు మార్చడం ద్వారా కాంట్రాక్టర్లకు మేలు చేశారని మండిపడుతున్నారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టాలంటే కేసీఆర్ సభల కంటే, అసెంబ్లీ వేదికగా రికార్డులతో సమాధానం చెప్పడం వల్ల ఎక్కువ మైలేజ్ ఉంటుందని భావిస్తున్నారు. 
 
అసెంబ్లీకి వెళ్లేందుకు కేసీఆర్ ఎందుకు విముఖం?

కేసీఆర్ గత కొన్నాళ్లుగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. విపక్ష నేతగా ఆయన ఉన్నా.. బాధ్యతలను హరీశ్ రావు, కేటీఆర్ నిర్వహిస్తున్నారు. కేసీఆర్ రాకపోవడాన్ని రేవంత్ తరచూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేసీఆర్ స్వయంగా వచ్చి తన వాగ్ధాటితో ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రభుత్వం అసెంబ్లీలో కేసీఆర్ లేని సమయంలో గత పదేళ్ల పత్రాలను బయటపెట్టి, ఆయనపై  జల ద్రోహి  ముద్ర వేసే ప్రమాదం ఉంది. అసెంబ్లీకి రాకుండా కేవలం సభలకే పరిమితమైతే రేవంత్ వేసిన పారిపోయారు అనే విమర్శను ఎదుర్కోవడం కష్టమవుతుంది.

ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు.. నిజాలు 

కృష్ణా  నీటిలో  తెలంగాణకు దక్కాల్సిన హక్కుల విషయంలో రాజకీయం పక్కన పెట్టి నిజాలు బయటకు రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి  నీళ్లు-నిజాలు పేరుతో చర్చకు పిలిచిన ఈ తరుణంలో, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి తన అనుభవంతో సమాధానం ఇస్తారో లేక తనదైన శైలిలో సభల ద్వారానే ప్రజలను ఆకట్టుకుంటారో చూడాలి. జనవరి 2న అసెంబ్లీ గంట మోగితే తప్ప ఈ సస్పెన్స్ వీడదు. 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget