Dragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP Desam
స్పేస్ ఎక్స్ సంస్థకు డ్రాగన్ క్యాప్య్సూల్ ద్వారా సునీతా విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములున్న క్రూ9 టీమ్ ఫ్లోరాడి సముద్ర తీరంలో సేఫ్ ల్యాండ్ అయ్యింది. పారాచూట్ల సాయంతో సముద్రజలాల్లోకి అంతరిక్షం నుంచి దిగిన డ్రాగన్ క్యాప్సూల్ ను స్పేస్ ఎక్స్, నాసా సంస్థలకు చెందిన సహాయక బృందాలు రెస్క్యూ చేశాయి. స్పేస్ ఎక్స్ సంస్థ కు చెందిన ఓ పెద్ద రికవరీ బోటు డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయిన చోటుకు రాగా దాంట్లో ఉండే టెక్నీషియన్స్ డ్రాగన్ క్యాప్సూల్ కు రోప్స్ కట్టి దాన్ని అతి జాగ్రత్తగా రికవరీ బోట్ లోకి ఎక్కించారు. దీనికి దాదాపుగా అరగంటకు పైగా సమయం పట్టింది. ప్రాథమిక పరీక్షల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ ను రికవరీ బోట్ లోకి ఎక్కించారు. కొద్ది సేపు పరిశీలన తర్వాత హ్యాచ్ ఓపెన్ ప్రక్రియను ప్రారంభించి ఆస్ట్రోనాట్లను బయటకు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం నాసా, స్పేస్ ఎక్స్ అధికారులు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు.





















