అన్వేషించండి

Renault Duster 2026 Price: భారత్‌లో కం బ్యాక్ చేసిన రెనాల్ట్ డస్టర్.. హైదరాబాద్‌లో బేసిక్, టాప్ ఎండ్ ధరలు ఇవే..

New Renault Duster 2026 Price: కొత్త Renault Duster భారత మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్ల వివరాలు తెలుసుకున్నాక SUV కొనుగోలుకు నిర్ణయం తీసుకోండి.

ఎట్టకేలకు భారత మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ (Renault Duster) లాంచ్ అయింది. డస్టర్ ఎస్‌యూవీ బేసిక్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.49 లక్షలుగా ఉంది. టాప్ మోడల్ ధర రూ. 18.49 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలలో డస్టర్ SUV తన సెగ్మెంట్లో ఇతర కార్ల కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవడంతో పాటు డస్టర్ ఎస్‌యూవీ బాడీ స్ట్రాంగ్‌గా ఇచ్చారు.

హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ ధరలు..

హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ బేస్ మోడల్ Authentic 1.0 Turbo (Petrol) ఎక్స్ షోరూమ్ ధర రూ.10,49,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 12,09,056 వరకు ఉంది. హైదరాబాద్‌లో టాప్ మోడల్ Iconic Launch Edition DCT (Petrol) ఎక్స్‌షోరూమ్ ధర రూ. 18,49,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 21,33,192 వరకు ఉంది. ఎక్స్‌షోరూమ్, ఆన్ రోడ్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటుంది. 

రెనాల్ట్ కంపెనీ ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే హైబ్రిడ్ మోడల్ కొంతకాలం తర్వాత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే చాలా కాలం తరువాత భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన రెనాల్డ్ డస్టర్ డిజైన్, ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

డస్టర్ డిజైన్, లుక్
రెనాల్ట్ కొత్త డస్టర్ డిజైన్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా, గతంలో కంటే మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇందులో పాత మోడల్ షేడ్స్ కనిపిస్తున్నప్పటికీ, మరింత మోడ్రన్, రఫ్ లుక్ ఇచ్చారు. మందపాటి బాడీ క్లాడింగ్, 18 ఇంచుల పెద్ద వీల్స్, ఎత్తైన స్టాన్స్ దీనికి పవర్‌ఫుల్ SUV లుక్‌ను అందిస్తాయి. కొత్త డస్టర్ మరియు డిజైన్ ఇతర SUVల నుండి దీనిని ప్రత్యేకం చేస్తాయి. వెనుక వైపు C-పిల్లర్‌లోని డోర్ హ్యాండిల్స్ కారుకు మరింత యూనిక్ స్టైల్‌ను ఇస్తాయి.

ఇంటీరియర్, ఫీచర్లు
కొత్త డస్టర్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ బ్లాక్, గ్రీన్ థీమ్‌లో వస్తుంది. ఇది కొత్త డస్టర్ వాహనానికి డిఫరెంట్ లుక్‌ను ఇస్తుంది. డిజైన్ సింపుల్‌గా, క్లియర్‌గా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల క్వాలిటీ  మరింత మెరుగ్గా ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. ఇందులో ఫీచర్లకు కొదవ లేదు. 360 డిగ్రీల కెమెరా, ADAS,గూగుల్ బిల్ట్ ఇన్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ డ్రైవర్ సైడ్ బెండ్ అవడం వల్ల యూజ్ చేయడానికి కంఫర్ట్‌గా అవుతుంది. బూట్ స్పేస్ చాలా పెద్దదిగా ఉండటం ఈ సెగ్మెంట్లో దీనిని బెస్ట్‌గా ఉంచుతుంది. క్యాబిన్ కొంచెం ఇరుకుగా అనిపించవచ్చు. దీనివల్ల ఎత్తుగా ఉన్న వారికి తక్కువ స్థలం ఉన్నట్లు ఫీలవుతారు. 

ఇంజిన్, డ్రైవింగ్ లో ఎలా ఉంటుంది..
కొత్త డస్టర్‌లో పలు ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 100bhp పవర్ ఇచ్చే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీంతో పాటు 160bhp పవర్ ఇచ్చే 1.3 లీటర్ టర్బో ఇంజిన్  ఉంది. ఇది మాన్యువల్ లేదా DCT గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని హైబ్రిడ్ వెర్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇందులో ఎక్కువ భాగం డ్రైవింగ్ ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సాధ్యమవుతుంది. డ్రైవింగ్ చేయడానికి ఈ SUV చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, దీని రైడ్ క్వాలిటీ బాగుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

మీరు దీనిని కొనవచ్చా?
మీరు ఒక స్ట్రాంగ్, ఫీచర్లు ఎక్కువగా ఉన్న, భిన్నంగా కనిపించే SUV కావాలనుకునే వారికి  కొత్త రెనాల్ట డస్టర్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. ముఖ్యంగా 1.3 లీటర్ టర్బో ఇంజిన్ మోడల్ ప్రస్తుతం బెస్ట్‌గా భావిస్తారు. ఒకవేళ మీరు ఎక్కువ మైలేజీని ఆశిస్తుంటే, హైబ్రిడ్ వెర్షన్ కోసం కొంతకాలం వేచి ఉండక తప్పదు. 

రెనో డస్టర్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 10.49 లక్షలుగా ఉంది. కొత్త డస్టర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ వంటి మిడ్ సైజ్ SUVలతో పోటీ పడుతుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు
స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 260km రేంజ్‌, కేవలం రూ.799కే మీ సొంతం!
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget