అన్వేషించండి

స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు

Avore EX1, EX2 & EX2S ఎలక్ట్రిక్ బైక్‌లు భారత్‌లో విడుదలయ్యాయి. రూ.1.23 లక్షల ప్రారంభ ధర, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Avore EX Electric Bike Price, Range And Features Telugu: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో మరో కొత్త కంపెనీ అడుగుపెట్టింది. గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్టప్ అవోర్ ‍‌(Avore), ఒకేసారి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను ఆవిష్కరించింది. Avore EX1, EX2 & EX2S పేర్లతో వచ్చిన ఈ మోడళ్లు కంపెనీ నుంచి తొలి ఉత్పత్తులు కావడం విశేషం. ప్రస్తుతం ఈ బైక్‌లకు ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ.799 టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఈ మూడు బైక్‌లు ఒకే తరహా స్పోర్ట్స్‌ డిజైన్‌తో వచ్చినప్పటికీ బ్యాటరీ సామర్థ్యం, రేంజ్‌, టాప్ స్పీడ్‌, ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బైక్‌ను తలపించే స్టైలింగ్‌, పొడవైన ఫెయిరింగ్‌, షార్ప్ బాడీ లైన్స్‌, ఆకర్షణీయమైన లుక్‌తో యువతను ఆకట్టుకునేలా అవోర్ కంపెనీ వీటిని రూపొందించింది.

Avore EX1
ఎంట్రీ లెవల్ మోడల్ అయిన అవోర్ EX1లో 3.24kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది IDC ప్రమాణాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. గరిష్ఠ వేగం 100kmph. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్‌ను అందించారు. ఈ మోడల్ ధర రూ.1.23 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌).

Avore EX2
మధ్యస్థ మోడల్ అయిన అవోర్ EX2లో పెద్దదైన 5kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 255 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. టాప్ స్పీడ్ 100kmphగానే ఉంటుంది. ఇందులో కూడా మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సాధారణ 15A సాకెట్‌తో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని అవోర్ తెలిపింది. ఈ మోడల్ ధర రూ.1.46 లక్షలుగా నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్

Avore EX2S
ఈ శ్రేణిలో అత్యంత ప్రీమియం మోడల్ అవోర్ EX2S. ఇందులో కూడా 5kWh బ్యాటరీనే ఉన్నప్పటికీ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. గరిష్ఠ వేగం 114kmph కాగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌లో ఐదు రైడింగ్ మోడ్స్‌తో పాటు 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఈ పెద్ద డిస్‌ప్లే ఈ లైనప్‌లో EX2Sకే ప్రత్యేకం. ఈ వేరియంట్ ధర రూ.1.70 లక్షలు.

ఫీచర్ల విషయానికి వస్తే మూడు మోడళ్లలోనూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు కంపెనీ చెబుతోంది. అయితే కెర్బ్ వెయిట్‌, సీటు ఎత్తు, సస్పెన్షన్ సెటప్‌, పూర్తి ఛార్జింగ్ సమయం వంటి పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించలేదు. త్వరలో వాటిని వెల్లడిస్తామని సంస్థ తెలిపింది.

అవోర్ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే ఆకర్షణీయమైన స్పోర్ట్స్‌ డిజైన్‌, మంచి రేంజ్‌, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం, అందుబాటు ధరలతో ఈ బైక్‌లు యువతతో పాటు రోజువారీ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ బైక్‌ను ఎంచుకోవాలనుకునే వినియోగదారులను ఆకట్టుకునే అవకాశముంది.

ఇది కూడా చదవండి: Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అవోర్ తన తొలి ఉత్పత్తులతోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రూ.1.23 లక్షల ప్రారంభ ధర నుంచి 260 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే ఈ లైనప్ మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. స్టైలిష్ లుక్‌, మంచి పనితీరు & ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి అవోర్ EX సిరీస్ ఒక ఆసక్తికరమైన కొత్త ఎంపికగా నిలవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget